KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

విజయ్, యశ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు షారుఖ్ ఖాన్. సౌత్ స్టార్స్ సినిమాలొస్తుంటే షారుఖ్ చేసిన ట్వీట్.. ఇప్పుడు వైరలవుతోంది. ఒక హీరోను పొగిడితే.. మరో హీరోకు మండుతుందో లేదో కానీ..

KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

Kgf2 Beast

KGF2 -Beast: విజయ్, యశ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు షారుఖ్ ఖాన్. సౌత్ స్టార్స్ సినిమాలొస్తుంటే షారుఖ్ చేసిన ట్వీట్.. ఇప్పుడు వైరలవుతోంది. ఒక హీరోను పొగిడితే.. మరో హీరోకు మండుతుందో లేదో కానీ.. ఫ్యాన్స్ ఊరుకోరు కదా.. షారుఖ్ ను అడ్డంగా బుక్ చేసి ట్రోల్ చేసేస్తున్నారు.

KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

ముంబైలో ఇంతటి రెస్పాన్స్ దక్కుతుంటే.. నీకు కనిపించడం లేదా అని షారుఖ్ ని ప్రశ్నిస్తున్నారు యష్ ఫ్యాన్స్. హిందీలో రిలీజైన బీస్ట్ మూవీ ట్రైలర్ చూసి విజయ్ పై ప్రశంసలు కురిపించాడు బాద్షా. విజయ్ కి పెద్ద ఫ్యాన్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో దళపతి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక కాస్త జెలసీగా ఫీలయిన యశ్ ఫ్యాన్స్.. కేజీఎఫ్2పై షారుఖ్ స్పందించకపోవడంతో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Beast: విజయ్‌కి షాకిచ్చిన కువైట్.. బీస్ట్ దూకుడుకు బ్రేకులెన్నో!

నార్త్ ఆడియెన్స్ ఎక్కువగా ఎదురుచూస్తోన్న కేజీఎఫ్ మేనియా.. మీకు నచ్చటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రిలీజ్ డేట్ విషయంలోనే కాదూ.. ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని కొందరు వీరంగం సృష్టించడమే ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది.