Beast: విజయ్‌కి షాకిచ్చిన కువైట్.. బీస్ట్ దూకుడుకు బ్రేకులెన్నో!

కోలీవుడ్ దళపతి విజయ్ బీస్ట్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బీస్ట్ మేకర్స్ కూడా జాలీ జింఖానా అంటూ రెచ్చిపోతామంటున్నారు. సాంగ్స్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్..

Beast: విజయ్‌కి షాకిచ్చిన కువైట్.. బీస్ట్ దూకుడుకు బ్రేకులెన్నో!

Vijay Beast

Beast: కోలీవుడ్ దళపతి విజయ్ బీస్ట్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బీస్ట్ మేకర్స్ కూడా జాలీ జింఖానా అంటూ రెచ్చిపోతామంటున్నారు. సాంగ్స్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన దళపతి.. సినిమా కలెక్షన్స్ తో రికార్డులు సెట్ చేయాలని చూస్తున్నారు. మరి ఇంతలో కువైట్ విజయ్ కి ఏ విధమైన షాకిచ్చింది? బీస్ట్ సినిమా దూకుడుకు కువైట్ బ్రేకులేస్తుందా? ఫుల్ డిటైల్స్ స్టోరీలో చూద్దాం.

Beast: బీస్ట్ తెలుగు రైట్స్ ఆయనకే..!

థలపతి విజయ్ బీస్ట్ సినిమా ఈనెల 13న రిలీజ్ కాబోతుంది. వరల్డ్ వైడ్ విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే కువైట్ గవర్నమెంట్ బీస్ట్ సినిమాను బ్యాన్ చేసిందన్న న్యూస్ ఇటు మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ నూ షాక్ కు గురిచేసింది. దాంతో బీస్ట్ కలెక్షన్స్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దళపతి ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

Beast: బీస్ట్ చిత్రాన్ని అక్కడి నుండి లేపేశారా..?

ఇస్లాం వాదులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని కువైట్ సెన్సార్ ప్యానల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా బీస్ట్ సినిమాను అక్కడ నిషేధించింది కువైట్ ప్రభుత్వం. ఇదే కారణంతో గతంలో కువైట్, మలేసియా ప్రభుత్వాలు.. దుల్కర్ సల్మాన్ కురుప్ అండ్ విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ సినిమాలనూ బ్యాన్ చేశాయి. సౌత్ ఇండియా సినిమాలకు మంచి ఆదరణ, భారీ కలెక్షన్స్ వచ్చే మలేషియాలో కూడా బీస్ట్ ను నిషేదిస్తే, కలెక్షన్స్ పైన గట్టి దెబ్బే పడబోతుందని బీస్ట్ రికార్డులపైన భారీ హోప్స్ పెట్టుకున్న విజయ్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

Beast: దక్షణాది అన్ని భాషల్లో ‘బీస్ట్’.. హిందీలో మాత్రం ‘రా’.. ఎందుకిలా?

రీసెంట్ గా రిలీజ్ అయిన బీస్ట్ ట్రయిలర్ వరల్డ్ వైడ్ విజయ్ ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ గా తెలుగులో రిలీజ్ అయిన ట్రయిలర్ కూడా ఇక్కడి ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను గ్రాబ్ చేసింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ సినిమా చార్ట్ బస్టర్ అరబిక్ కుతు, జాలీ ఓ జింఖానా సాంగ్స్ అయితే ఈ సినిమా పైన హైప్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాయి. ఒకవేళ కువైట్, మలేసియాలో ఈ సినిమా రిలీజ్ కాకపోయినా కూడా వరల్డ్ వైడ్ గా మిగతా ఏరియాల్లో వచ్చే కలెక్షన్స్ రికార్డులు సృష్టించడం ఖాయం అని ఎదురు చూసే ఫ్యాన్సూ ఉన్నారు. ఇటు ఇండియా వైడ్ కేజిఎఫ్ 2, జెర్సీ లాంటి సినిమాల పోటీ, అటు కువైట్ దెబ్బ గట్టిగానే తగలడంతో కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని, హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవద్దని సూచించే ట్రేడ్ వర్గాల వారూ అంటున్నారు. ఏదేమైనా ఈనెల 13 వరకు వెయిట్ చేస్తే అన్ని లెక్కలు తేలిపోతాయంటున్నారు కామన్ ఆడియన్స్.