Beast: బీస్ట్ తెలుగు రైట్స్ ఆయనకే..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో..

Beast: బీస్ట్ తెలుగు రైట్స్ ఆయనకే..!

Beast Telugu Rights To Dil Raju

Beast: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో విజయ్ ఓ కాప్‌గా మనకు కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Beast: బీస్ట్ చిత్రాన్ని అక్కడి నుండి లేపేశారా..?

అయితే బీస్ట్ చిత్రాన్ని తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారా అనే ప్రశ్ని ఇటీవల చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ సినిమా తెలుగు హక్కులను సురేష్ బాబు, ఏషియన్ సునీల్, దిల్ రాజు కలిసి భారీ రేటుకు దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. బీస్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కేవలం దిల్ రాజు ఒక్కడే చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన సొంతంగా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Beast: ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్ చేసిన బీస్ట్!

అలాగే బీస్ట్ చిత్రంలోని ‘అరబిక్ కుతు’ పాట ఏ రేంజ్‌లో యూట్యూబ్‌ను షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన తెలుగు, హిందీ లిరికల్ సాంగ్స్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు దిల్ రాజు. ఇక ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరి తెలుగునాట ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.