Mega 158 : మెగా 158లో కూలీ లేడీ విలన్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా (Mega 158 ) బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
Rachita ram replaces honey rose in mega 158
Mega 158 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 158వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన ఓవార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తొలుత ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం హనీ రోజ్‌ను అనుకున్నారట. అయితే.. ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అంటున్నారు. ఇక ఈ పాత్ర కోసం కన్నడ బ్యూటీ రచితా రామ్‌ను చిత్ర బృందం సంప్రదించిదని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
Priyanka Jain : ప్రియుడి బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సీరియల్ నటి ప్రియాంక..
కూలీ చిత్రంతో రచిత మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీలో పాజిటివ్‌గా కనిపిస్తూ నెగెటివ్ షేడ్స్ చూపించే పాత్రలో జీవించేసింది. కాగా.. రచితకు తెలుగులో ఇది రెండో సినిమా కానుంది. గతంలో సూపర్ మచ్చి చిత్రంలో నటించింది.
ఇదిలా ఉంటే.. వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరు కూతురిగా మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
