Beast: బీస్ట్ చిత్రాన్ని అక్కడి నుండి లేపేశారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని వేసవి కానుకగా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు....

Beast: బీస్ట్ చిత్రాన్ని అక్కడి నుండి లేపేశారా..?

Beast Movie Inspired From Paul Blart Mall Cop

Beast: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని వేసవి కానుకగా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దీనికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన వారు కొందరు ఈ సినిమాను ఓ హాలీవుడ్ మూవీ నుండి లేపేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Beast: కేజీఎఫ్-2తో యుద్ధానికి సిద్ధమైన బీస్ట్!

ఈ సినిమా ట్రైలర్‌లో ఓ షాపింగ్ మాల్‌ను కొందరు వ్యక్తలు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ షాపింగ్ మాల్‌లో చాలా మంది ప్రజలు ఉంటారు. అయితే పోలీసులు ఏమీ చేయలేని సమయంలో, మాల్‌లోనే ఉండిపోయిన ఓ కాప్‌గా విజయ్ మనకు కనిపిస్తాడు. అతడు దుండగుల బారి నుండి షాపింగ్ మాల్‌లోని ప్రజలను ఏ విధంగా కాపాడాడా అనేది బీస్ట్ చిత్ర కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇలాటి కథతోనే హాలీవుడ్‌లో ‘పాల్ బ్లార్ట్ – మాల్ కాప్’ అనే సినిమా గతంలో వచ్చింది. ఈ సినిమాలోనూ షాపింగ్ మాల్‌లో జరిగే ఇలాంటి ఘటనలే మనకు కనిపిస్తాయి.

Beast: దక్షణాది అన్ని భాషల్లో ‘బీస్ట్’.. హిందీలో మాత్రం ‘రా’.. ఎందుకిలా?

ఈ హాలీవుడ్ సినిమాలో హీరో పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది.. అతడు చేసే కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కానీ బీస్ట్ చిత్రంలో విజయ్ చాలా సీరియస్ కాప్ పాత్రలో మనకు కనిపిస్తున్నాడు. ఆయన చేసే యాక్షన్ స్టంట్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి. మొత్తానికి బీస్ట్ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సమయంలో, ఇలా ఓ హాలీవుడ్ మూవీ నుండి ఈ సినిమా కథను లేపేశారు అనే వార్త ఇప్పుడు చిత్ర విజయంపై ప్రభావం చూపుతాయా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.