KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాలదే హవా సాగుతోంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ సందర్భంగా నేషనల్ మీడియాలో ఎంతటి హడావిడి....

KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

After Rrr Now Kgf 2 Making Noise In National Media

KGF2: ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాలదే హవా సాగుతోంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ సందర్భంగా నేషనల్ మీడియాలో ఎంతటి హడావిడి చేసిందో మనం చూశాం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తూ, పలు జాతీయ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ గత నెలరోజులుగా సందడి చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ మార్చి 25న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం గడుస్తుండటంతో జనంలో కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక జాతీయ మీడియాలో ఆర్ఆర్ఆర్ జోష్ చల్లబడటంతో, ఇప్పుడు మరో సౌత్ సినిమా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

KGF2: కేజీఎఫ్ చాఫ్టర్-2 రన్ టైమ్ లాక్.. సెన్సార్ రిపోర్ట్ ఇదే!

ఈ క్రమంలోనే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అదిరిపోయే బజ్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇప్పటికే స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్, తాజాగా నేడు ఢిల్లీలో నేషనల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ మీడియాతో పంచుకుంది. ఇక ఈ సినిమా కోసం కేవలం దక్షిణాది ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF2: కేజీఎఫ్2.. ట్రైలర్‌తోనే రికార్డుల మోత!

హీరో యశ్ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ చల్లబడగానే కేజీఎఫ్ జాతీయ మీడియాలో అగ్గిరాజేసేందుకు రెడీ అయ్యిందంటున్నారు సినీ క్రిటిక్స్.