KGF2: కేజీఎఫ్2.. ట్రైలర్‌తోనే రికార్డుల మోత!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా...

KGF2: కేజీఎఫ్2.. ట్రైలర్‌తోనే రికార్డుల మోత!

Kgf 2 Trailer Creates Record In 24 Hours

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా వార్తల్లో నిలిచాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో నటించిన యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుందని ప్రకటించినప్పటి నుండి కూడా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు చిత్ర యూనిట్.

KGF 2 Trailer : వైలెన్స్.. వైలెన్స్.. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ విడుదల..

కాగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి కేవలం 24 గంటల్లోనే 109+ మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌కు కన్నడలో 18 మిలియన్, తెలుగులో 20 మిలియన్, హిందీలో 51 మిలియన్, తమిళంలో 12 మిలియన్, మలయాళంలో 8 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

KGF 2: రక్తంతో రాసిన కథ..!

దీన్ని బట్టి ఈ సినిమా కోసం ఏ రేంజ్‌లో ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టండన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ట్రైలర్‌తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన కేజీఎఫ్ 2 రిలీజ్ తరువాత ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.