KGF2: ఆర్ఆర్ఆర్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్2..?

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ 2 మరికొద్ది రోజుల్లో మనముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా....

KGF2: ఆర్ఆర్ఆర్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్2..?

Kgf2 Crosses Rrr Pre Sales In North India

KGF2: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ 2 మరికొద్ది రోజుల్లో మనముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. అయితే కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ చిత్రాలను ఇష్టపడే నార్త్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

KGF2: కేజీఎఫ్2కు తోడుగా సలార్.. సర్‌ప్రైజ్ ఇస్తారా?

ఇక ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం సౌత్‌తో పాటు నార్త్ ఇండియా సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు కేజీఎఫ్ 2 చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా తాజాగా కేజీఎఫ్ 2 చిత్రం అప్పుడే రికార్డుల వేటను మొదలుపెట్టినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నార్త్‌లో కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా, అక్కడ ఈ టికెట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతున్నాయట. నార్త్‌లో కేజీఎఫ్ 2 చిత్రాన్ని 3000+ స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తుండగా, గురువారం నాడు మల్టీప్లెక్స్‌లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా ఆర్ఆర్ఆర్ చిత్ర రికార్డులను క్రాస్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఆడియెన్స్ కేజీఎఫ్ 2 చిత్ర టికెట్లను ఎగబడి కొంటున్నారట. ఇక ఆదివారం లేదా సోమవారం నాటికి సింగిల్ స్క్రీన్ టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయనుండటంతో ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు తొలిరోజు కేజీఎఫ్ 2 చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రావచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

KGF2: ఆర్ఆర్ఆర్ అయిపోయింది.. కేజీఎఫ్ మొదలెట్టింది!

అయితే అదే రోజున జెర్సీ మూవీ కూడా రిలీజ్ అవుతుండటంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జెర్సీ వర్సెస్ కేజీఎఫ్ 2 క్లాష్ ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి నిజంగానే నార్త్‌లో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టీజియస్ మూవీ రికార్డులను కేజీఎఫ్ 2 బద్దలు కొడుతుందా లేదా అనేది తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.