IPL 2026 – Vaibhav Sooryavanshi : ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు వైభవ్. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు బాదాడు.
IPL 2026-Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనం, 15ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో అతడు 16 ఇన్నింగ్స్‌లలో 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. 15 సంవత్సరాల 65 రోజుల వయసులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ఈ గౌరవాన్ని పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు వైభవ్. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు బాదాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో మిస్ అయ్యాడు. ఈ సీజన్లో సూర్యవంశీ కేవలం తన 23వ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్ మన్ గిల్ 16 ఇన్నింగ్స్‌లలో 732 పరుగులతో రెండో స్థానంలో నిలవగా, అతని సహచరుడు సాయి సుదర్శన్ 724 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరూ త్వరగానే ఔటయ్యారు. గిల్ 10 పరుగులే చేసి ఔటవగా, సుదర్శన్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read: ఐపీఎల్ లో విజేతగా నిలిచే జట్టుకే కాదు రన్నరప్‌కు ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంత అంటే..
