Hero SatyaDev: అభిమాని చేసిన ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. ‘కృష్ణమ్మ’ ఓటీటీ రిలీజ్‌పై సత్యదేవ్ ఎమోషనల్
తనకు చెప్పకుండా కృష్ణమ్మ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయడంపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన సత్యదేవ్(Hero SatyaDev).
Hero Satyadev emotional comments about Krishnamma movie
- ‘కృష్ణమ్మ’ ఓటీటీ రిలీజ్‌పై సత్యదేవ్ ఆవేదన.
- అభిమాని మెసేజ్‌తో గుండె పగిలింది.
- రెండేళ్ల కష్టంపై నటుడి ఎమోషనల్.
Hero SatyaDev: టాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ప్రస్తుతం ‘సమవర్తి’, ‘రావు బహదూర్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి ‘జ్యోతిలక్ష్మీ’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలతో హీరోగా స్థిరపడిన ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోని ఒడిదుడుకులు, కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ‘కృష్ణమ్మ’ సినిమా ఫలితంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Anu Emmanuel: మే నెల జ్ఞాపకాలు.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన అను ఇమ్మాన్యుయేల్
కొరటాల శివ సమర్పణలో వచ్చిన ‘కృష్ణమ్మ’ చిత్రం తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని సత్యదేవ్(Hero SatyaDev) పేర్కొన్నారు. అయితే, రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్న సమయంలో ఎన్నికల వేడి వల్ల థియేటర్ల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. అంతేకాకుండా, తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విడుదలైన ఆరో రోజుకే (గురువారం) సినిమాను ఓటీటీలోకి తెచ్చేశారని, థియేటర్లలో చూడమని తాను పోస్ట్‌లు పెడుతుంటే.. ఓటీటీ స్క్రీన్ షాట్ పంపి ఒక అభిమాని మండిపడటంతో తన గుండె పగిలిపోయిందని ఆవేదన చెందారు.
ఒక్క శుక్రవారం విజయం కోసం తాము రెండేళ్ల పాటు కష్టపడి ఎదురుచూస్తామని, తీరా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తీవ్రంగా బాధపడి ఏడుస్తామని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మళ్లీ లక్ష్యాలను గుర్తుచేసుకుని కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని, ఇక్కడ ఎవరైనా వచ్చి టాలెంట్ నిరూపించుకోవచ్చని, అయితే సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుందని ఆయన విశ్లేషించారు.
