Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!

ఓటీటీలో.. ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పు కంటెంట్ లో కాలేసినట్టే. ఓటీటీ ఇప్పుడు హాట్ కేక్ లా సేల్ అయ్యే ఫ్లాట్ ఫామ్.

Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!

Star's Ott Entry

Star’s OTT Entry: ఓటీటీలో.. ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పు కంటెంట్ లో కాలేసినట్టే. ఓటీటీ ఇప్పుడు హాట్ కేక్ లా సేల్ అయ్యే ఫ్లాట్ ఫామ్. అందుకే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఇప్పుడు ఓటీటీ మీద విపరీతంగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు అంతకన్నా ఎగ్జైటింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఓటీటీ.. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీడియా. ఫస్ట్ లో ఓటీటీ అంటే పెద్దగా అవకాశాలు లేక, ఫేడవుట్ అయిన స్టార్ కాస్ట్ తోనే కంటెంట్ ఉంటుందనుకునే వారు. కానీ సినిమాలకు మించి క్రేజీగా సిరీస్ లు, సినిమాలు తెరకెక్కించడంతో స్టార్లు కూడా ఓటీటీ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ జనాలు ముందే ఉన్నా.. సౌత్ స్టార్లు మాత్రం ఇప్పుడిప్పుడే ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు.

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో ఈ వారం సినిమాలివే!

లేటెస్ట్ గా అక్కినేని హీరో నాగచైతన్య చేస్తున్న దూత లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సౌత్ లో స్పెషల్లీ తెలుగు స్టార్స్ ఇప్పటి వరకూ పెద్దగా ఓటీటీకి రాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. నాగచైతన్య.. ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న దూత వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెవర్ బిఫోర్ రోల్ లో కనిపిస్తున్నారు. మూడు సిరీస్ లుగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో నాగచైతన్య తన రొటీన్ ఇమేజ్ ని బ్రేక్ చేసే ఇంటెన్స్ లుక్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.

Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

సీనియర్ హీరో వెంకటేష్ కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ-రానా డ్యుయో కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ రానా నాయుడు టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రైమ్ డ్రామాగా హిందీలో తెరకెక్కుతున్న ఈ మూవీతో అటు వెంకటేష్, రానా ఓటీటీకి వస్తున్నారు.

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

తెలుగు, తమిళ్, మళయాళం, హిందీలో సినిమాలు చేస్తున్న దుల్కర్ కూడా.. ఓటీటీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ తో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రాజ్, డి.కెతో కలిసి గన్స్ అండ్ గులాబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లోకి వస్తున్నారు. నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో డార్క్ రొమాన్స్ కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ గన్స్ అండ్ గులాబ్ ప్రజెంట్ షూటింగ్ లో బిజీగా ఉంది.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

సౌత్ స్టార్లు ఇప్పుడిప్పుడే ఓటీటీల షూట్ స్టార్ట్ చేస్తుంటే.. బాలీవుడ్ స్టార్లు మాత్రం ఆల్రెడీ వెబ్ సిరీస్ లు చేస్తూ.. గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సూపర్ హిట్ మూవీ షేర్షా హీరో సిద్దార్ద్ మల్హోత్రా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక వైపు వరసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటీటీ కంటెంట్ వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

OTT platformsలో ALTBalaji.. adult కంటెంట్ కాదు లోకల్ కంటెంట్ మాత్రమే

రోహిత్ శెట్టి పోలీస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పోలీస్ ఫోర్స్ లో వివేక్ ఒబెరాయ్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆషికీ 2తో అదరగొట్టిన ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఓటీటీ స్పేస్ ని వాడుకుంటున్నారు. బ్రిటిష్ సిరీస్.. ద నైట్ మేనేజర్ ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న ఇంట్రస్టింగ్ సరిసీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

కబీర్ ఖాన్ మూవీతో 300కోట్లు కలెక్షన్ల వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూ.. ఓటీటీకి వస్తున్నారు. రాజ్, డి.కె క్రేజీ కాంబినేషన్లో విజయ్ సేతుపతి, రాశిఖన్నా లీడ్ రోల్స్ లో సిరీస్ చేస్తున్నారు షాహిద్ కపూర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.