Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

ఈ నెల మొత్తం వారం కూడా గ్యాప్ లేకుండా ధియేటర్లు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్నాయి. ఆడియన్స్ అందరూ బిగ్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్ వైపే వెళ్లిపోతారని ఓటీటీ కూడా ఇదే రేంజ్ లో పోటీగా..

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

Theaters Vs Ott

Theaters VS OTT: ఈ నెల మొత్తం వారం కూడా గ్యాప్ లేకుండా ధియేటర్లు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్నాయి. ఆడియన్స్ అందరూ బిగ్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్ వైపే వెళ్లిపోతారని ఓటీటీ కూడా ఇదే రేంజ్ లో పోటీగా పెద్ద సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేస్తోంది. మరి ఈనెల అటు ధియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఓటీటీలో గట్టిపోటీ ఇస్తున్న సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

OTT Release: థియేటర్‌లో క్రేజీ సినిమాలు.. అయినా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

అటు ధియేటర్లు ఇటు ఓటీటీలు ఎక్కడా తగ్గడం లేదు. ఇద్దరి మధ్యా పోటీ ఆడియన్స్ కి ప్లస్ అవుతోంది. అటు ధియేటర్లో ఇటు ఓటీటీలు ఏది వీలుంటే అది చూస్తూ.. ఫుల్ ఎంగేజ్ అయిపోతున్నారు ఆడియన్స్. కానీ ఓటీటీలు మాత్రం ధియేటర్లకు ఏమాత్రం తగ్గకుండా పెద్ద సినిమాలతో పోటీపడుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ న ధియేటర్లో తాప్సీ లీడ్ రోల్ చేసి మిషల్ ఇంపాజిబుల్ రిలీజ్ అయితే.. ఇదేరోజు రాధేశ్యామ్ ని ఓటీటీలోకి దింపేసింది అమెజాన్ ప్రైమ్.

2021 Hindi OTT Releases: బాలీవుడ్‌‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ టీజర్ తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి కూడా రావడంతో సినిమా మీద మంచి వైబ్సే ఉన్నాయి. సరే ఈ సినిమా ధియేటర్లో చూద్దాం కదా అనుకునే లోపే.. ఏప్రిల్ ఫస్ట్ నే ప్రభాస్, పూజాహెగ్డే.. సినిమా రాధేశ్యామ్ రిలీజ్ అయిన 22 రోజులకే ఓటీటీలో ఆడియన్స్ ని అవైలబుల్ గా ఉంటోంది. సో అటు తాప్సీ మూవీ కంటే.. పాన్ ఇండియా స్టార్ సినిమాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని అమెజాన్ ఐడియా.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

ఒక వైపు ధియేటర్లో మిషన్ ఇంపాజిబుల్ మరో వైపు అమెజాన్ లో రాదేశ్యామ్.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా చూద్దాం అని ఆలోచించుకనే లోపే.. వన్ డే గ్యాప్ తో శర్వానంద్ సినిమా ఏప్రిల్ 2న సోనీ లివ్ లో రిలీజ్ అవుతోంది. శర్వానంద్ రష్మిక మందన్న కాంబినేషన్లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా పెద్దగా ఆడలేదు. అయితే సినిమా నిండా ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఉండడంతో ఉగాది రోజు సోనీ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడమే టార్గెట్ గా పెట్టుకుంది.

OTT Release: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!

ఏప్రిల్ సెకండ్ వీక్ లో కూడా ధియేటర్లు, ఓటీటీల మద్య పోటీ కంటిన్యూ అవుతోంది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో వరుణ్ తేజ్ గని మూవీ రిలీజ్ అవుతోంది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ సాయిమంజ్రేకర్ తెలుగు ఎంట్రీ ఇస్తున్న ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఏప్రిల్ 8న ధియేటర్లో రిలీజ్ అవుతోంది. గని రిలీజ్ నాటికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 7న ఓటీటీ లోకొస్తోంది సూర్య ఈటి మూవీ. ఎవరికీ తలవంచడు టైటిల్ తో తెరకెక్కిన సూర్య ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్.. నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో అవైలబుల్ గా ఉంటోంది.

OTT Release : వెయిట్ చెయ్యం.. ఓటీటీలో వదిలేస్తామంటున్న మేకర్స్..

ఏప్రిల్ 7,8లో సినిమాలతో ఆల్రెడీ ఎంగేజ్ అయిన ఆడియన్స్ కి.. ఏప్రిల్ 8న మరో క్రేజీ మూవీ డబుల్ ట్రీట్ ఇస్తోంది. రాజ్ తరుణ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘స్టాండ్ అప్ రాహుల్’ అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహా లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 8న ఆహాలో రిలీజ్ అవుతోంది రాజ్ తరుణ్ మూవీతో కలిపి మొత్తం ఏప్రిల్ సెకండ్ వీక్ లో 3 ఇంట్రస్టింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

ఏప్రిల్ థర్డ్ వీక్ లో మాత్రం ధియేటర్లు, ఓటీటీల పోటీ పీక్స్ కి చేరబోతోంది. ఏప్రిల్ 13న తమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ బీస్ట్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 14న ధియేటర్లు దద్దరిల్లబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కెజిఎఫ్ 2 ధియేటర్లోకొస్తోంది. భారీబడ్జెట్, భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది .

Top South Actors: వీళ్లు ఇకపై గ్లోబల్ స్టార్లు.. పారితోషికం భారీగానే!

ఏప్రిల్ 14నే ఓటీటీలోకి మరో కన్నడ సినిమా రిలీజ్ అవుతోది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా “జేమ్స్” మూవీ ఏప్రిల్ 14న సోనీ లివ్ యాప్ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అవుతోంది. పునీత్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయిన జేమ్స్ కన్నడలో రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. జేమ్స్ ఒక్క కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా నువ్వా నేనా అంటూ ధియేటర్లో సినిమాలకు పోటీగా ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గకుండా వరసగా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి.