OTT Release : వెయిట్ చెయ్యం.. ఓటీటీలో వదిలేస్తామంటున్న మేకర్స్..

OTT Release : వెయిట్ చెయ్యం.. ఓటీటీలో వదిలేస్తామంటున్న మేకర్స్..

Ott Release

OTT Release: కరోనా సెకండ్ వేవ్ సెగ ఎక్కువగా ఉండడంతో సినిమాలకు కూడా బ్రేక్ పడింది. షూటింగ్స్‌తో పాటు థియేటర్లు కూడా క్లోజ్ చెయ్యడంతో ఇక సినిమాలు రిలీజ్ చేసే ఆప్షన్స్ లేక, అందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. లేటెస్ట్‌గా ఓటీటీ రూట్‌లోకి వెళుతున్నసినిమా లేవో చూద్దాం..

Drushyam 2 : వెంకీ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ‘దృశ్యం 2’ షూటింగ్ పూర్తి!..

కరోనా దెబ్బకి షూటింగ్స్ ఆగిపోయాయి. రిలీజ్ చేద్దామనుకున్న సినిమాలుకూడా థియేటర్లు లేకపోవడంతో అవి కూడా ఆగిపోయాయి. పోయిన సంవత్సరంలా ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయో అన్న క్లారిటీ లేకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే తెలుగుకు సంబంధించి 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసిన వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారని టాక్. ఈ సినిమాతో పాటు అనసూయ లీడ్ రోల్ చేసిన ‘థ్యాంక్ యు బ్రదర్’ మూవీ ఆల్రెడీ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో మే 7న రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Tughlaq Durbar

తెలుగులోనే కాదు తమిళనాడులో కూడా థియేటర్లు క్లోజ్ చెయ్యడంతో తమిళ్ సినిమాలు కూడా రిస్క్ ఎందుకని ఓటీటీల వైపే చూస్తున్నాయి.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ.. రాశి ఖన్నా, మాంజిమా మోహన్ హీరోయిన్స్‌గా చేస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోందంటూ అనౌన్స్ చేశారు యూనిట్..

Raangi

విజయ్ సేతుపతి సినిమాతో పాటు నయనతార, త్రిష చేస్తున్న రెండు సినిమాలూ ఓటీటీ వైపే చూస్తున్నాయి. మురుగదాస్ కథతో త్రిష యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ‘రాంగీ’ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో కోవిడ్ రావడంతో ఈ సినిమాని కూడా ఓటీటీ‌లోనే రిలీజ్ చేసి సేఫ్ అవుదామని చూస్తున్నారు మేకర్స్. మరో హీరోయిన్ నయనతార విజువల్లీ ఛాలెంజెడ్ రోల్ ప్లే చేస్తూ.. విఘ్నేష్ శివన్ ప్రొడ్యూస్ చేస్తున్న థ్రిల్లర్ ‘నెట్రికన్’ కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.

Netrikann