Bigg Boss 5 : ప్రియాంక సింగ్‌కు తమన్నా సపోర్ట్.. ఏ ట్రాన్స్‌జెండర్ వల్ల ఇది సాధ్యం కాలేదు..

తాజాగా ప్రియాంక సింగ్ కు తమన్నా సింహాద్రి మద్దతు పలుకుతూ ఓ వీడియో చేసింది. తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా........

Bigg Boss 5 : ప్రియాంక సింగ్‌కు తమన్నా సపోర్ట్.. ఏ ట్రాన్స్‌జెండర్ వల్ల ఇది సాధ్యం కాలేదు..

Tamanna Simhadri

Bigg Boss 5 :  ఈ సీజన్ బిగ్ బాస్ దాదాపు ఆఖరి దశకి వచ్చేసినట్టే. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బయట సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పటిదాకా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం బయట చాలా మంది సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తూ వాళ్ళ అభిమానులని కూడా సపోర్ట్ చేయమన్నారు. తాజాగా ప్రియాంక సింగ్ కు తమన్నా సింహాద్రి మద్దతు పలుకుతూ ఓ వీడియో చేసింది.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. ఆ సీజన్ లో మూడు వారాలు ఉన్నా బిగ్‌బాస్‌ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. మూడు వారాల తర్వాత ఆమె హౌస్ లో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షో గురించి ఎక్కువగా మాట్లాడలేదు. తాజాగా బిగ్‌బాస్‌ షోలో ప్రియాంక సింగ్‌కు మద్దతు ఇస్తున్నానంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

ఈ వీడియోలో తమన్నా సింహాద్రి మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ముగిసిన ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్‌ షో గురించి మాట్లాడుతున్నాను. ట్రాన్స్‌జెండర్‌ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునేవారే గుర్తొస్తారు. కానీ అయినవాళ్లందరికి దూరమై, ఎన్నో కష్టాలు పడి చాలామంది గౌరవంగా బతకాలని ముందుకు వస్తున్నారు. వాళ్లలో ప్రియాంక సింగ్‌ ఒకరు. ఆమె బిగ్‌బాస్‌కు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది.

Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోని బిగ్‌బాస్‌ షోలలో ఇప్పటివరకు ట్రాన్స్‌జెండర్లను తీసుకున్నారు. కానీ అందరూ రెండు మూడు వారాల కంటే ఎక్కువగా హౌస్‌లో ఉండలేకపోయారు. ప్రియాంక మాత్రం 10 వారాల పైనే ఉంది. ఆమె ఫినాలేలో అడుగుపెట్టి గెలిస్తే అది వేరే లెవల్‌లో ఉంటుంది. నేను ఆమెకు సపోర్ట్‌ చేస్తున్నాను. మీరు కూడా ఆమెకు సపోర్ట్‌ చేస్తే తను విజేతగా అవతరించే అవకాశం ఉంది. ఒక ట్రాన్స్‌వుమెన్‌ బిగ్ బాస్ విన్నర్‌ అయితే రికార్డు సృష్టించిన వాళ్ళం అవుతాము. అందుకే అందరూ ప్రియాంక సింగ్‌కు ఓటేయండి’ అని కోరింది తమన్నా సింహాద్రి. మరి ఈ వీడియో ప్రియాంకకి ఎంత వరకు సపోర్ట్ ఇస్తుందో చూడాలి.