Bigg Boss 5: దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడో?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అందుకే సీజన్లు మారినా.. ఏ భాషలో అయినా ఈ షోకు ఎక్కడలేని క్రేజ్ కట్టబెట్టారు ప్రేక్షకులు. తెలుగులో కూడా కాస్త అటూ ఇటుగా రేటింగ్స్ మారినా నాలుగు..

Bigg Boss 5: దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడో?

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అందుకే సీజన్లు మారినా.. ఏ భాషలో అయినా ఈ షోకు ఎక్కడలేని క్రేజ్ కట్టబెట్టారు ప్రేక్షకులు. తెలుగులో కూడా కాస్త అటూ ఇటుగా రేటింగ్స్ మారినా నాలుగు సీజన్లు హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఐదవ సీజన్ కూడా గ్రాండ్ గానే నడుస్తుంది. ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తయిన ఈ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు ఇంటి నుండి బయటకి వచ్చేశారు. ప్రస్తుతం బీబీ ఇంట్లో 13 మంది మాత్రమే ఉన్నారు.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

తొలి రెండు వారాలు మినహా గత నాలుగు వారాల నుండి ఈ షో వీక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గత వారం అయితే రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. వీకెండ్ లో హోస్ట్ నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ పర్వాలేదనిపించినా మిగతా ఐదు రోజులు ఈ షోకు ప్రేక్షకులు మొహం చాటేస్తున్నారు. షో సమయం కూడా రాత్రి పదిగంటలకు మార్చడంతో బిగ్ బాస్ ఈ సీజన్ లో ఇంకేదో ప్రేక్షకులకు చూపిస్తాడని అనుకున్నారు. కానీ.. రానురాను షోలో పసలేకుండా పోయింది.

Big Boss 5: ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?

ముఖ్యంగా గేమ్ సంగతెలా ఉన్నా ముఖ్యంగా షోలో గ్లామర్ మిస్ అయింది. లహరి, హమీదా, శ్వేతా ఇలా అందరూ వారి స్థాయిలో గ్లామర్ డాల్స్ గానే అనిపించుకున్నారు. ముఖ్యంగా హమీదా.. మరో కంటెస్టెంట్ శ్రీరామచంద్ర మధ్య లవ్ ట్రాక్ కోసమే షో చూసినవాళ్లు కూడా ఉన్నారు. కానీ అనూహ్యంగా హమీదాను ఇంటి నుండి బయటకి పంపేయడం.. ఆ తర్వాత వారమే శ్వేతాను ఎలిమినేట్ చేసేయడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ షోపై ఆసక్తి చూపడం లేదు. మిగిలిన వాళ్ళతో గొడవలు, వాగ్వాదాలతోనే షో నడిపించాలని చూడడం కూడా కొందరు ప్రేక్షకులకు నాన్ సెన్స్ గా కనిపిస్తుంది.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

బిగ్ బాస్ లో ఇప్పుడు అత్యవసరంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగాలన్నది ఈ షో అభిమానుల మాట. అది కూడా గ్లామర్ డాల్స్ ను ఇంట్లో దించితే ఆ కళే వేరుగా ఉంటుందంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. అది ఎంతకీ నిజం కావడం లేదు. వైజాగ్ సోషల్ మీడియా స్టార్ ప్రీతీ అన్షు, ఎలిమినేట్ అయిన లహరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంట్లోకి పంపనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇప్పుడు ఈ షోకు అత్యవసరంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాల్సిందే. మరి నిర్వాహకులు అభిమానుల మొరాలకిస్తారో లేదో!