Big Boss 5: ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ షో తెలుగులో..

Big Boss 5: ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?

Big Boss 5 (1)

Big Boss 5: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ప్రస్తుతం ఐదవ సీజన్స్ ఐదవ వారానికి చేరుకుంది. గత రెండు సీజన్లను నడిపించిన కింగ్ నాగ్ హోస్ట్ ఈ సీజన్ ను కూడా తనకు సాధ్యమైనంతగా నడిపిస్తున్నాడు. అయితే, బిగ్ బాస్ పేరుకు తగ్గట్లుగా ఈ సీజన్ రక్తికట్టించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu: సూపర్ విమెన్‌తో సూపర్ స్టైలిష్‌గా మహేష్.. గ్యాలరీ

తొలివారం నుండి ఐదవ వారానికి మధ్యలో మెల్లగా ఈ షో టీఆర్పీ రేటింగులు తగ్గుతూ వస్తున్నదే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ, టీఆర్పీలను ప్రామాణికంగా ప్రక్కన పెడితే.. షో చూసే ప్రేక్షకులలో కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తుంది. వీకెండ్ లో నాగ్ వచ్చే రెండు రోజులు మాత్రం షో చూసే వాళ్ళు ఎక్కువ మందే ఉండగా మిగతా ఐదు రోజులలో ఈ షోకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. షో నిర్వాహకులు, క్రియేటివిటీ టీం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఈ షోను ప్లాన్ చేయలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది.

Anchor Shyamala: మత్తెక్కించే అందాలతో మాయచేస్తున్న శ్యామల!

నిజానికి క్రియేటివిటీ టీం ఏ రోజుకారోజు షో ప్రోమోలను కట్ చేయడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అందుకే ప్రోమోలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. అయితే.. తీరా షోలోకి వెళ్తే అంతగా ఆసక్తి ఉండడం లేదు. కంటెస్టెంట్ల మధ్య టాస్కులు, కంటెస్టెంట్లను ఆట ఆడించే విధంగా సూచనల విషయంలో ఇంకా శ్రద్ద పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకేరకమైన ఫార్మేట్ లో సాగుతున్న షో కూడా ప్రేక్షకులకు కొత్తగా కనిపించడం లేదు. కేవలం కెప్టెన్ ఎన్నిక, వరస్ట్ పర్ఫామెన్స్ వంటి టాస్కులతోనే నాలుగు రోజులు గడిచిపోగా.. ఒక్క రోజే మిగతా గేమ్ సాగుతుంది.

Telugu Actors: మొన్న తేజ్.. ఇప్పుడు రామ్.. ఎందుకిలా జరుగుతోంది?

ఇక వారాంతంలో మాత్రం నాగ్ తన వంతు బాధ్యతగా షోను నడిపిస్తున్నారు. అయితే.. అసలు ప్రోమోలు అంత ఆసక్తిగా కట్ చేసిన టీం గేమ్ ప్లాన్ లో మాత్రం ఎందుకు వెనకబడిపోతుందన్నది ఇప్పుడు ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న ప్రశ్న. కెప్టెన్ ఎవరు అవుతారు.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారన్నది కూడా ప్రేక్షకులు ముందే ఊహించే స్థాయికి చేరితే ఇక షో చూడాలనే థ్రిల్ ఏముంటుంది.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

ఉన్న కంటెస్టెంట్లలో భారీ స్థాయి ఫాలోయింగ్ ఉన్న వారు లేకపోవడం ఒకెత్తు అయితే.. ఉన్న వారిలో కూడా ఎవరు వీక్ ఉన్నారో కూడా చూసే ప్రేక్షకులు స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లే టాస్కులలో కూడా పసలేకపోవడంతో షో నీరసంగా మారిపోయినట్లు అర్ధమవుతుంది. మరి బిగ్ బాస్ ఇకనైనా ఫార్మాట్ మార్చి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటారో లేదో చూడాలి.