Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

ఒక్క నెల.. ఇంకా ఒక్క నెలే.. మన స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలతో బిజీ అవ్వడానికి . ప్రభాస్ దగ్గరనుంచి ఎన్టీఆర్ వరకూ అందరూ నెక్ట్స్ మన్త్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కొత్త సినిమాతో..

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

Telugu New Films

Telugu New Films: ఒక్క నెల.. ఇంకా ఒక్క నెలే.. మన స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలతో బిజీ అవ్వడానికి . ప్రభాస్ దగ్గరనుంచి ఎన్టీఆర్ వరకూ అందరూ నెక్ట్స్ మన్త్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కొత్త సినిమాతో కొత్త ఎక్స్ పీరియన్స్ కోసం నవంబర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మన హీరోలు . మరి ఏ స్టార్ హీరో ల కొత్త సినిమాలు వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్నాయో చూద్దాం.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

నవంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు స్టార్ హీరోలు. ఇప్పటికే పాత సినిమా పనుల్ని ప్యాకప్ చేసే పనిలో బిజీగా ఉన్న హీరోలు నెక్ట్స్ మన్త్ కొత్త సినిమాల్ని మొదలుపెడుతున్నారు. ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ తో , రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. నాగశ్విన్ తో స్టార్ట్ చేసిన సినిమా రెగ్యులర్ షూట్ ని నవంబర్ నుంచే మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!

మూడేళ్ల నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా తప్ప మరో వైపు చూడని ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో రెండో సారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పటి వరకూ సినిమా మొదలుపెట్టలేదు. ఈ గ్యాప్ లో స్మాల్ స్క్రీన్ షోస్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. నవంబర్ నుంచి కొరటాలతో సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

Telugu Movie Releases: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!

అటు ట్రిపుల్ ఆర్, ఇటు ఆచార్య రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అఫీషియల్ గా స్టార్ట్ చేసిన చరణ్.. ఈ సినిమాకు సంబందించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబందించి ఇప్పటికే టీమ్ తో డిస్కస్ చేసిన చరణ్.. నవంబర్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. నిజంగా పెద్ద పండగే!

సీనియర్ హీరో బాలకృష్ణ అఖండని కంప్లీట్ చేసేశారు. ఆల్రెడీ క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా కూడా అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాని కూడా నెక్ట్స్ మన్త్ నుంచే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని.. ఈ సారి కూడా గ్యాప్ తీసుకోకూడదని బాలయ్య డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది.