Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్వేతావర్మ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతంలో, పరిశ్రమకి వచ్చిన కొత్తలో చాలా మంది తనతో అసభ్యంగా మాట్లాడటం, కమిట్ మెంట్ అంటూ

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

Swetha

Bigg Boss Swetha :  బిగ్ బాస్ తో అంతగా ఎవరికీ తెలియని వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు. బిగ్ బాస్ తర్వాత కాస్తో కూస్తో సెలబ్రిటీ హోదా వస్తుంది. అంతకు ముందు వాళ్ళు ఎన్ని వర్క్స్ చేసినా, కష్టాలు పడినా అవన్నీ బిగ్ బాస్ తర్వాత చెప్పుకోడానికి పనికొస్తాయి. బిగ్ బాస్ అయిపోయాక ఆ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఇంటర్వ్యూలలో చాలా ఆసక్తికర విషయాలని వెల్లడిస్తారు.

Blakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేయడానికి నేను రెడీ : మోహన్ బాబు

ఈ సీజన్ బిగ్ బాస్ లో సైడ్ హీరోయిన్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్వేత కూడా పాల్గొంది. 7 వారాల తర్వాత శ్వేత ఎలిమినేటి అయింది. అంతకుముందు శ్వేతా వర్మ అంటే ఎవరికీ తెలీదు. కాని బిగ్ బాస్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్వేతావర్మ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతంలో, పరిశ్రమకి వచ్చిన కొత్తలో చాలా మంది తనతో అసభ్యంగా మాట్లాడటం, కమిట్ మెంట్ అంటూ అడగడం చేశారు. పారితోషికం ఎంతైనా ఇస్తాం అనేవారు అని తెలిపింది.

NTR : తనయులతో ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ పిక్

2015 సంవత్సరంలో నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. ఆ సమయంలో ఒకసారి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి యాడ్ లో మీరు నటించాలి, అందుకు లక్ష రూపాయలు పారితోషికంగా ఇస్తాం కాని మాకు కమిట్ మెంట్ ఇవ్వాలంటూ అడిగాడు. నాతో అలా మాట్లాడటంతో కోపం వచ్చి నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను కమిట్ మెంట్ ఇవ్వాలంటున్నారు, మరి నేను అడిగినట్లుగా ఎత్తైన బిల్డింగ్ మీద నుండి దూకి చస్తారా మీరు అంటూ ప్రశ్నించాను. దాంతో అవతల వైపు సైలెంట్ అయిపోయి ఎలాంటి స్పందన రాలేదు. నేను ఎప్పటికైనా ట్యాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో ముందుకు సాగుతాను అంతే కాని నాకు ఏ ఒక్కరి సాయం కాని, ఏ ఒక్కరికి కమిట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తెలిపింది. మరి బిగ్ బాస్ తర్వాత శ్వేతా వర్మకి ఎలాంటి ఛాన్సులు వస్తున్నాయో తెలియాల్సి ఉంది.