Bipin Rawat : ద‌ట్ట‌మైన పొగ‌మంచులో రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వైరల్ వీడియో

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన ఆర్మీ హెలికాప్ట‌ర్ బుధ‌వారం నీల‌గిరి కొండ‌ల్లో కూలిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దుర్ఘ‌ట‌న‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Bipin Rawat : ద‌ట్ట‌మైన పొగ‌మంచులో రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వైరల్ వీడియో

Bipin Rawat (6)

Bipin Rawat : సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ఎంఐ-17 వీ5 బుధ‌వారం నీల‌గిరి కొండ‌ల్లో కూలిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దుర్ఘ‌ట‌న‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీనిని నీలగిరి కొండల్లోని టూరిస్టులు చిత్రించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి కొద్దీ క్షణాల ముందు ఈ వీడియో తీసినట్లుగా స్పష్టమవుతుంది.

చదవండి : Bipin Rawat : ప్రమాదం తర్వాత రావత్ ప్రాణాలతోనే ఉన్నారు – ఫైర్‌మెన్

టూరిస్టులు నీలగిరి కొండల అందాలను ఫోన్‌లో వీడియో తీస్తుండగా.. అటుగా హెలికాప్టర్ సౌండ్ రావడంతో దానిని తమ ఫోన్ వీడియోలు తీశారు. ద‌ట్టంగా ఉన్న పొగ‌మంచుల్లోకి హెలికాప్ట‌ర్ వెళ్తున్న‌ట్లు ఆ వీడియోలో క‌నిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

చదవండి : Bipin Rawat : అమరుడు సాయితేజ.. ఆర్మీలో ఎప్పుడు చేరారు.. రావత్ దృష్టిలో ఎలా పడ్డారు