Bipin Rawat : ప్రమాదం తర్వాత రావత్ ప్రాణాలతోనే ఉన్నారు – ఫైర్‌మెన్

ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూ‌టీమ్ లోని ఫైర్‌మెన్ తెలిపారు. శిథిలాల నుంచి రావత్‌ను తాము ప్రాణాలతో బయటకు తీశామన్నారు.

Bipin Rawat : ప్రమాదం తర్వాత రావత్ ప్రాణాలతోనే ఉన్నారు – ఫైర్‌మెన్

Bipin Rawat (5)

Bipin Rawat :  హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూ టీమ్ లోని ఫైర్ మెన్ తెలిపారు. IAF హెలికాప్టర్ శిథిలాల నుంచి రావత్ ను తాము ప్రాణాలతో బయటకు తీశామని.. బయటకు రాగానే తన పేరు చెప్పారని ఫైర్‌మెన్ తెలిపారు. రావత్ తోపాటు మరోవ్యక్తి కూడా ప్రాణాలతోనే ఉన్నారని తెలిపారు. తరువాత అతన్ని గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని గుర్తించామని వివరించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో రావత్ ప్రాణాలు కోల్పోయారని, వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారని తెలిపారు.

చదవండి : Bipin Rawat : అమరుడు సాయితేజ.. ఆర్మీలో ఎప్పుడు చేరారు.. రావత్ దృష్టిలో ఎలా పడ్డారు

ఇక ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ LS లిద్దర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సైనిక సలహాదారు, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పిఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కె సింగ్, JWO దాస్, JWO ప్రదీప్ ఎ, హవల్దార్ సత్పాల్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయి తేజ మృతి చెందారు.

చదవండి : Bipin Rawat : ఢిల్లీలో రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు

ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో 12 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని తాను చూశానని క్రాష్ సైట్ సమీపంలో నివసించే స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి రవి మీడియాతో మాట్లాడుతూ, పెద్ద శబ్ధం వినిపించిందని, మంటల్లో హెలికాప్టర్ కిందికి దిగడం చూశానని చెప్పారు. వెంటనే, తాను సమీపంలోని కొంతమంది నివాసితులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో కాలిపోయిన 12 మృతదేహాలను తాము గుర్తించామని స్థానికులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను రక్షించామని, వారు ప్రాణాలతో పోరాడుతున్నారని తెలిపారు. అధికారులు వారిని వెల్లింగ్టన్ ఆసుపత్రికి తరలించారని వివరించారు.