Bipin Rawat : ఢిల్లీలో రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో జరగనున్నాయి. గురువారం సాయంత్రానికి రావత్ దంపతుల పార్థివ దేహాలు ఢిల్లీ చేరనున్నాయి

Bipin Rawat : ఢిల్లీలో రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు

Bipin Rawat (3)

Bipin Rawat : బుధవారం తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు కన్నుమూసిన విషయం తెలిసిందే.. వెల్లింగ్టన్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.

చదవండి : Bipin Rawat : భారీ శబ్దం వచ్చింది.. హెలికాప్టర్ రెక్కలు చెట్లను తగలడం చూశాం – ప్రత్యేక్ష సాక్షులు

ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో జరగనున్నాయి. గురువారం సాయంత్రానికి రావత్ దంపతుల పార్థివ దేహాలు ఢిల్లీ చేరనున్నాయి. సైనిక విమానంలో తమిళనాడు నుంచి ఢిల్లీకి పార్థివ దేహాలను తరలించనున్నారు ఆర్మీ అధికారులు. ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని బిపిన్ రావత్ నివాసంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పార్థివ దేహాలను ఉంచనున్నారు. అనంతరం బిపిన్ రావత్ నివాసం కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు రావత్ దంపతుల అంతిమ యాత్ర కొనసాగుతుంది.

చదవండి : Bipin Rawat : నాడు మృత్యుంజయుడు.. స్వల్పగాయాలతో బయటపడ్డ బిపిన్ రావత్

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియల్లో, రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.