Bipin Rawat : అమరుడు సాయితేజ.. ఆర్మీలో ఎప్పుడు చేరారు.. రావత్ దృష్టిలో ఎలా పడ్డారు

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సాయితేజ పారాట్రూపర్‌గా ఎంపికై కఠిన శిక్షణ తీసుకున్నాడు. రావత్ దృష్టిలోపడి ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేరారు.

Bipin Rawat :  అమరుడు సాయితేజ.. ఆర్మీలో ఎప్పుడు చేరారు.. రావత్ దృష్టిలో ఎలా పడ్డారు

Bipin Rawat (4)

Bipin Rawat : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయి తేజ(29) దుర్మరణం పాలయ్యారు. సాయితేజ బిపిన్ రావత్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరుగా ఉన్నారు. సాయితేజ మరణం జిల్లా వాసులను కలచివేసింది. 2012లో సిపాయిగా ఆర్మీలో చేరిన సాయితేజ.. మొదట జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహించారు. సైన్యంలో నిర్వహించే పారాట్రూపర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కఠిన శిక్షణ తీసుకున్నారు. దేశంలో అత్యంత దృఢమైన, శక్తి సామర్ధ్యాలు కలిగిన వారే ఈ పారట్రూపర్స్. శత్రు దేశాల్లోకి వెళ్లి దాడి చేయడంలో వీరు సిద్ధకస్తులు, పాకిస్తాన్‌పై మొదటి సర్జికల్ స్ట్రైక్ చేసింది పారాట్రుపార్సే. సాయితేజ పార్థివదేహం ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది.

చదవండి : Bipin Rawat : ఢిల్లీలో రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు

పారాట్రూపర్స్ శిక్షణలో రాటుతేలిన సాయితేజ కొంతకాలం పారాట్రూపర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆయన శక్తిసామర్ధ్యాలనూ గుర్తించిన రావత్ తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేర్చుకున్నారు. రావత్, ఆయను బాగా అబిమానించేవారని స్నేహితులు చెబుతున్నారు. సాయితేజ ప్రోత్సాహంతో తన తమ్ముడు మహేష్ బాబు కూడా సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అతడు సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ మరణం ఒక్క చిత్తూరు జిల్లా వాసులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బాధలో ముంచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు ఘననివాళి అర్పిస్తున్నారు ప్రజలు.

చదవండి : Bipin Rawat : భారీ శబ్దం వచ్చింది.. హెలికాప్టర్ రెక్కలు చెట్లను తగలడం చూశాం – ప్రత్యేక్ష సాక్షులు

ప్రమాదానికి కొద్దీ గంటల ముందు భార్యతో మాట్లాడిన సాయితేజ

సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ(2), కూతురు దర్శిని (2) ఉన్నారు. ప్రస్తుత సాయితేజ ఫ్యామిలి ఢిల్లీలో ఉంటున్నారు. బుధవారం ఉదయం 8గంటల 15 నిమిషాల సమయంలో భార్యకు ఫోన్ చేశాడు.. పిల్లలను చూడాలనిపిస్తుందంటూ భార్యతో చెప్పి పిల్లలతో సంతోషంగా మాట్లాడాడు. ఇది జరిగిన మూడు గంటలకే హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతి చెందాడు. కాగా వినాయకచవితికి చివరి సారి సాయితేజ ఇంటికి వచ్చాడు.