CM Kejriwal: కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన.. లిక్కర్ స్కాం నేపథ్యంలో సీఎం రాజీనామాకు డిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు ఈడీ ఆరోపించింది.

CM Kejriwal: కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన.. లిక్కర్ స్కాం నేపథ్యంలో సీఎం రాజీనామాకు డిమాండ్

CM Kejriwal: ఢిల్లీలో శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్లు, ఆయన పేరును ఈడీ చార్జిషీటులో చేర్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పేరు చార్జిషీటులో ఉన్నందువల్ల ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ముఖ్యమంత్రి పేరు చార్జిషీటులో ఉండటమంటే మామూలు విషయం కాదని, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఈ ఒక్క కారణం చాలని బీజేపీ నేతలు అన్నారు.

Telangana TSHC Recruitment : తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్ జడ్జి పోస్టుల నియామకం!

కేజ్రీవాల్‌కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా కేజ్రీవాల్ కార్యాలయంలోకి చొరబడేందుకు బీజేపీ నేతలు ప్రయ్నతించారు. అయితే, బీజేపీ నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.