Telangana TSHC Recruitment : తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి పోస్టుల నియామకం!
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

TS High Court Recruitment
Telangana TSHC Recruitment : తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుస వెంట నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 సివిల్ జడ్జి పోస్టుల నియామకాలను చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 08 ఖాళీలు, బదిలీల ద్వారా 2 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు 1 మార్చి 2023తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tshc.gov.in/ పరిశీలించగలరు.