Chiru 154: మలయాళ సినిమా కథతోనే చిరుతో బాబీ సినిమా?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా..

Chiru 154: మలయాళ సినిమా కథతోనే చిరుతో బాబీ సినిమా?

Chiru 154

Chiru 154: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Rajamouli: సల్మాన్‌తో జక్కన్న భేటీ.. వెనుక అసలు కథేంటి?

పక్కా మాస్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని.. అందుకే ఫస్ట్ లుక్ లో చిరు పోస్టర్ తో ఇది రివీల్ చేశారని చర్చ జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఓడ, సముద్రం హైలెట్ చేయడంతో ఇందులో చిరు చేపలు పట్టే వ్య‌క్తి పాత్రలో నటిస్తున్నట్లుగా ఊహలు కూడా మొదలయ్యాయి. ఇక, ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య, లేక వాల్తేరు శీను అనే టైటిల్స్ లో ఒకటి ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జరుగుతుండగా.. ఇందులో మరో ముఖ్య పాత్ర కోసం రవితేజను ఒప్పించినట్లు కథనాలొచ్చాయి.

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

కాగా.. ఇప్పుడు ఈ సినిమా కథపై కూడా ఓ ప్రచారం మొదలైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు ఇది అనధికారిక రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరో అభిమాని మధ్య జరిగే ఈగో క్లాష్‌పై ఆ సినిమా కథ నడవగా ఇందులో కూడా ఇదే కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా చిరు-బాబీల సినిమా ఉండబోతుందని టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ ప్రచారం జరిగిపోతుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.