Bollywood : ముంబైలో సెలబ్రెటీ రేవ్ పార్టీ భగ్నం, ఎన్సీబీ అదుపులో బాలీవుడ్ నటుడు ?

ముంబైలో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎన్సీబీ అధికారులు. ఏకంగా షిప్ లో ఈ పార్టీ జరిగింది. ఓ బాలీవుడ్ నటుడితో పాటు.. సూపర్ స్టార్ట్స్ కుమారులను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది

Bollywood : ముంబైలో సెలబ్రెటీ రేవ్ పార్టీ భగ్నం, ఎన్సీబీ అదుపులో బాలీవుడ్ నటుడు ?

Rave Party Mumbai

Bollywood Rave Party : ముంబైలో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎన్సీబీ అధికారులు. ఏకంగా షిప్ లో ఈ పార్టీ జరిగింది. బాలీవుడ్ కు చెందిన ఓ నటుడితో పాటు.. సూపర్ స్టార్ట్స్ కుమారులను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. రేవ్ పార్టీ జరుగుతోందని ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. పార్టీ జరుగుతున్న సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఓ బాలీవుడ్ నటుడు, 10 మంది ప్రముఖులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ కుమారులు రేవ్ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తొంది.

Read More : Bhabanipur Bypoll : తేలనున్న మమత భవితవ్యం, భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

వీకెండ్ వచ్చిందంటే..చాలు..ఎక్కడో ఒక చోట రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఈ పార్టీలు రహస్యంగా నిర్వహిస్తున్నారు. బడా బాబులు, ఇతర సెల్రబెటీలు ఇందులో పాల్గొంటున్నారు. ముంబైలో క్రూయిజ్ షిప్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. కార్డేలియా క్రాయజ్ షిప్ ముంబై నుంచి గోవా వెళుతోంది. రేవ్ పార్టా జరుగుతోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకుని దాడులు నిర్వహించారు.

Read More : WhatsApp : 20 లక్షల భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్

పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారని తేలింది. పలువురు డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిలో 10 మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. అయితే..ఎవరినీ అరెస్టులు చేయలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. పార్టీకి రూ. లక్ష ఫీజు ఉన్నట్లు తెలుస్తోంది.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తర్వాత…బాలీవుడ్ లో మాదకద్రవ్యాల వినియోగంపై NCB విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాజ్ పుత్ స్నేహితురాలు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడులను అరెస్టు చేసింది. మరికొందరు బెయిల్ పొంది బయట ఉన్నారు.