Bhabanipur Bypoll : తేలనున్న మమత భవితవ్యం, భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భవితవ్యం తేలనుంది. భవానీపూర్‌ ఎన్నిక ఫలితం 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం వెలువడనుంది.

Bhabanipur Bypoll : తేలనున్న మమత భవితవ్యం, భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

Mamata

Bhabanipur Mamata : పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భవితవ్యం తేలనుంది. భవానీపూర్‌ ఎన్నిక ఫలితం 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం వెలువడనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మమత బైపోల్‌లో కచ్చితంగా విజయం సాధించాలి.

Read More : CM Jagan : నేడు పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన

ఈ ఏడాది మార్చిలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ భవానీపూర్‌లో విజయం సాధించారు. శోభన్ దేవ్‌కు 73వేల 505 ఓట్లు పోల్ అవగా బీజేపీ అభ్యర్థి రుద్రనీల్ ఘోష్‌కు కేవలం 44వేల 786 ఓట్లు మాత్రమే వచ్చాయి. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో ఓటమిపాలవడంతో… ఆమె కోసం శోభన్ దేవ్ తన సీటును త్యాగం చేశారు. ఈ నెల 30న భవానీపూర్ ఉపఎన్నిక జరగ్గా… 53.32 శాతం పోలింగ్ జరిగింది. భవానీపూర్‌లో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

Read More :Bigg Boss 5: నలుగురు సేఫ్.. నో డౌట్ ఎలిమినేషన్ మాస్టరే?

ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో 2011, 2016లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. తాజాగా మరోసారి అక్కడి నుంచి పోటీ చేసిన దీదీ… మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. భవానీపూర్ ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.