Bigg Boss 5: నలుగురు సేఫ్.. నో డౌట్ ఎలిమినేషన్ మాస్టరే?

చూస్తుండగానే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లకు నాలుగో వారం కూడా పూర్తవుతుంది. 19 మందితో మొదలైన ఈ ఇంటి ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు మధ్యలోనే వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా ఈ వారం మరో..

Bigg Boss 5: నలుగురు సేఫ్.. నో డౌట్ ఎలిమినేషన్ మాస్టరే?

Bigg Boss 5 (1)

Bigg Boss 5: చూస్తుండగానే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లకు నాలుగో వారం కూడా పూర్తవుతుంది. 19 మందితో మొదలైన ఈ ఇంటి ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు మధ్యలోనే వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా ఈ వారం మరో కంటెస్టెంట్ గ్లాస్ హౌస్ నుండి బయటకి రానున్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని ఆసక్తిగా మారింది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా ఈ వారం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

కాగా, ఈ ఎనిమిది మందిలో శనివారం ఎపిసోడ్ లో నలుగురిని సేవ్ చేశాడు బిగ్ బాస్. జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో మొదలైన శనివారం వీకెండ్‌ ఎపిసోడ్‌ లో.. షణ్ముఖ్‌ తనను మళ్లీ దూరం పెడుతున్నాడని ఏడ్చేసింది సిరి. ఇదే విషయంపై తర్వాత షణ్ముఖ్‌, సిరి ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకోగా.. నేను నీ దగ్గరుంటే గేమ్‌పై ప్రెజర్‌ పడుతుందని ఫీలవుతున్నావ్‌, అంతేగా.. ఈ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్‌ ఉంది కానీ చెప్పను, టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పింది సిరి. తర్వాత నాగార్జున.. ఇంటిసభ్యులకు హాయ్‌ చెప్తూనే.. హౌస్‌లో అతడిని తొక్కేస్తున్నారని చెప్పుకొస్తూనే జెస్సీ మీద జాలిపడ్డాడు.

Big Boss 5: లంచ్‌కి సిరి.. డిన్నర్‌కి హమీదా.. శ్రీరామ్ రొమాంటిక్ స్టోరీ!

తర్వాత లోబోను నామినేషన్స్‌లో అంతెత్తున అరిచేసి సారీ చెప్పడంపై పద్ధతి కాదని చెప్పిన నాగ్ పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్‌ యూజ్‌ చేయొద్దని హితవు పలికాడు. బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ను పంపించడంతో కంటెస్టెంట్లు వాటిని గబగబా ఆరగించగా.. షణ్ముఖ్‌-సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. షణ్ముఖ్‌ కూర్చుని కబుర్లు చెప్తున్నాడని, అతడిలోని ఫైర్‌ బయటకు తీసుకురావాలని బిగ్ బాస్ మిర్చి పంపించాడని నాగ్ పేర్కొన్నాడు. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్‌ అవుతున్నాడని తెలిపాడు.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది

తర్వాత నాగ్‌ గిటార్‌ అందుకుని శ్రీరామ్‌ పాడిన పాట ప్లే చేసి ఈ పాట వింటుంటే ఏం ఫీల్‌ వస్తుందని అడగ్గా.. హమీదా లవ్‌ ఫీల్‌ వచ్చిందని పేర్కొంది. దీంతో ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తోందని మరోసారి చెప్పకనే చెప్పాడు నాగ్‌. తర్వాత యాంకర్‌ రవి సేవ్‌ అయినట్లు ప్రకటించాడు. అలా నామినేషన్లో ఉన్న ఎనిమిది మందిలో సేవ్ అయిన ఒక్కొక్కరి పేర్లు బయటపెట్టేశాడు. మొత్తంగా శనివారం ఎపిసోడ్ లో రవి, ప్రియ, కాజల్, సన్నీ సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించగా లోబో, యానీ, సిరి, నటరాజ్‌ ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీళ్లలో నటరాజ్‌ ఎలిమినేట్‌ అయినట్లుగా ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.