Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

బిగ్ బాస్.. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం ఎలిమినేషన్స్ లో నామినేషన్స్‌. ఈ నామినేషన్లో దొరకకుండా హౌస్ మేట్స్ తో పరస్పర అవగాహనతో ఆడగలిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రక్రియకు..

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

Big Boss 5

Updated On : October 2, 2021 / 2:50 PM IST

Big Boss 5: బిగ్ బాస్.. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం ఎలిమినేషన్స్ లో నామినేషన్స్‌. ఈ నామినేషన్లో దొరకకుండా హౌస్ మేట్స్ తో పరస్పర అవగాహనతో ఆడగలిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రక్రియకు వెళ్ళరు. ఒక్కసారి నామినేషన్స్ లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది. కాగా, ఐదవ సీజన్ లో హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో మూడు వారాలు ముగ్గురిని బయటకి పంపేశాడు బిగ్ బాస్.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది

ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా ఈ వారం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ ఈ వారం డేంజర్ లో ఉండగా ఈ ఎనిమిది మందిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. మరి వీరిలో ఈ వారం హౌస్ నుండి బయటకి వెళ్ళేదెవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ముందే లీక్ అయిందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది

నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు మగాళ్లు కాగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు. అయితే.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ముగ్గురు కూడా ఆడవాళ్లే కావడంతో ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా, నామినేట్ అయిన ఎనిమిది మందిలో నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఓటింగ్ లో డేంజర్ జోన్లో ఉన్నారు. దీనిని బట్టి ఈ వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లు వినిపిస్తుంది. హౌస్ లో నటరాజ్ మాస్టర్ బిహేవియర్ కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తుంది. మిగతా కంటెస్టెంట్లను జంతువులతో పోలుస్తూ నటరాజ్ మాస్టర్ చేసే కామెంట్స్ నెగిటివిటీ తేవడంతో ఫైనల్ గా హౌస్ నుండి బయటకి వచ్చే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తుంది.