Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది
హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో మూడు వారాలు ముగ్గురిని బయటకి పంపేశాడు బిగ్ బాస్. నాలుగో వారం మొదలు కావడం.. ఈ వారం ఎలిమినేషన్ తతంగం కూడా మొదలు పెట్టాడు.

Big Boss 5
Big Boss 5: హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో మూడు వారాలు ముగ్గురిని బయటకి పంపేశాడు బిగ్ బాస్. నాలుగో వారం మొదలు కావడం.. ఈ వారం ఎలిమినేషన్ తతంగం కూడా మొదలు పెట్టాడు. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం ఎలిమినేషన్స్ లో నామినేషన్స్. ఈ నామినేషన్లో దొరకకుండా హౌస్ మేట్స్ తో పరస్పర అవగాహనతో ఆడగలిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రక్రియకు వెళ్ళరు. ఒక్కసారి నామినేషన్స్ లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది.
Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!
కానీ, బిగ్ బాస్ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు కనుక సోమవారం యధావిధిగా ప్రస్తుతం హౌస్ లో ఉన్న 16 మంది మధ్య నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు. నాలుగోవారంలో నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించగా.. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నామినేషన్ ప్రక్రియను హీటెక్కించారు. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు.
Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!
మొదటగా ప్రియతో ఈ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని బిగ్ బాస్ కోరగా ప్రియా.. లోబో, సన్నీని నామినేట్ చేసింది. ఆ తర్వాత విశ్వ.. రవి, నటరాజ మాస్టర్; లోబో.. ప్రియ, సిరి; శ్రీరామ్.. శ్వేత, ఆనీ మాస్టర్; షణ్ముఖ్ జస్వంత్.. యాంకర్ రవి, లోబో; నటరాజ్ మాస్టర్.. ఆర్జే కాజల్, సన్నీ; సిరి.. ఆనీ మాస్టర్, లోబో; మానస్.. లోబో, నటరాజ్ మాస్టర్; శ్వేతా.. లబో, యాంకర్ రవి; హమీదా.. నటరాజ్ మాస్టర్, లోబో; నటరాజ్ మాస్టర్.. విశ్వ, యాంకర్ రవి; ప్రియాంక.. లోబో, కాజల్; యాంకర్ రవి.. కాజల్, నటరాజ్ మాస్టర్; ఆనీ మాస్టర్… సిరి, రామ్; సన్నీ.. ప్రియ, కాజల్; జెస్సీ.. ప్రియాంక, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు.
Big Boss 5: దేవకన్యలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్ ఇచ్చిన బ్యూటీ!
మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి ఎక్కువ ఓట్స్ పొందిన నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఈ నాలుగో వారం హౌస్ నుండి బయటకి పంపానుండగా ఎవరు ఈ వారం ఎలిమినేషన్ కానున్నారు.. ప్రేక్షకులు వీరిలో ఎవరిని హౌస్ లోనే ఉండాలని భావిస్తున్నారన్నది తేలాల్సి ఉంది.