Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద రోజురోజుకీ హైప్స్ పెంచేస్తున్నారు. టాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాడ్ అయినప్పుడే సినిమా వేరే లెవల్..

Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!

Liger Mike Tyson

Updated On : September 28, 2021 / 8:32 AM IST

Liger-Mike Tyson: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద రోజురోజుకీ హైప్స్ పెంచేస్తున్నారు. టాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాడ్ అయినప్పుడే సినిమా వేరే లెవల్ అనకున్నారు. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ యాడ్ అయ్యి సినిమాని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లారు టీమ్.

Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!

టాలీవుడ్ ఆడియన్స్ కే కాదు.. టోటల్ గా ఇండియన్ ఆడియన్స్ కే బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పాడు విజయ్ దేవరకొండ. అసలు తెలుగు ఆడియన్స్ కలలో కూడా ఊహించని ఓ లెజెండ్ ని లైగర్ లో చూపించబోతున్నారు. పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో ద గ్రేట్ ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ ఫస్ట్ టైమ్ తెలుగు తెరపై కనిపించబోతున్నారు.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది

బాక్సింగ్ అంటే టైసన్.. టైసన్ అంటే బాక్సింగ్ అనే రేంజ్ లో బాక్సింగ్ స్టార్ గా ట్రెండ్ సెట్ చేశారు మైక్ టైసన్. అలాంటి లెజెండరీ స్టార్ ని ఫర్ ద ఫస్ట్ టైమ్ తెలుగు ఆడియన్స్ కి పరిచయం చెయ్యబోతున్నారు లైగర్ టీమ్. సినిమాలో విజయ్ కు బాక్సింగ్ ట్రెయినర్ రోల్ లో కనిపించబోతున్న మైక్ టైసన్ కు నమస్తే టైసన్ అంటూ గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతోంది లైగర్ టీమ్.

Bigg Boss 5 Telugu : లహరిని కావాలనే ఎలిమినేట్ చేశారా..?

పూరీజగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ లైగర్.. సాలా క్రాస్ బ్రీడ్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్.. పూరీ కనెక్ట్స్ తోపాటు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంటే.. మైక్ టైసన్ ఎంట్రీతో ఆ లెవల్ ఇంటర్నేషనల్ కి వెళ్లిపోయిందని ఫుల్ ఖుష్ అవుతున్నారు రౌడీ ఫ్యాన్స్.