WhatsApp : 20 లక్షల భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ ఆగస్టులో సుమారు 20 ల‌క్ష‌ల ఎకౌంట్ల‌కు పైగా బ్యాన్ చేసింది.

WhatsApp : 20 లక్షల భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్

Whatsapp (1)

20 lakh Indians accounts banned : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ ఆగస్టులో సుమారు 20 ల‌క్ష‌ల ఎకౌంట్ల‌కు పైగా బ్యాన్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఆయా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వాట్సప్ చాట్ ను అసాంఘీక పనుల కోసం, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను పంపించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ అకౌంట్లను వాట్సప్ బ్యాన్ చేసింది.

గత ఆగస్టులో 20,70,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. అందులో 222 అకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకున్నారు. ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి కూడా కొన్ని అకౌంట్ల బ్యాన్ పై అప్పీల్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సప్ లోని ఓ టూల్ ఆధారంగా హానికరమైన బిహేవియర్ ఉన్న అకౌంట్లను బ్యాన్ చేసింది.

WhatsApp: వాట్సప్‌ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ ల ద్వారా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను టూల్ గుర్తిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది యూజర్ రిపోర్ట్ చేసి బ్లాక్ చేసినప్పుడు సంబంధిత అకౌంట్ ను టూల్ అనలైజ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం భారతదేశానికి చెందిన అకౌంట్లే కావడం గమనార్హం.

ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా వాటిలో 2,011,000 అకౌంట్లను మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బ్యాన్ చేసింది.