Blue Origin Rocket Explosion : లాంచ్ ప్యాడ్‌పైనే పేలిన రాకెట్.. వీడియో వైరల్.. జెఫ్ బేజోస్ కంపెనీకి భారీ షాక్..
Blue Origin Rocket Explosion : బిలియనీర్ జెఫ్ బేజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ చేపట్టిన న్యూ గ్లెన్ రాకెట్ పరీక్ష విఫలమైంది. లాంచ్ ప్యాడ్‌లో న్యూగ్లెన్ రాకెట్ పేలింది.
Blue Origin Glenn Rocket Explodes at Launch Pad in Florida Video Viral
- లాంచ్ ప్యాడ్‌పైనే పేలిన బ్లూ ఆర్జిన్ రాకెట్..
- జెఫ్ బేజోస్ కంపెనీకి భారీ షాక్
- “హాట్‌ఫైర్ టెస్ట్” సమయంలో పేలిన రాకెట్
Blue Origin Rocket Explosion : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కేప్ కెనావెరల్లో బ్లూ ఆరిజిన్ (Blue Origin)కు చెందిన “న్యూ గ్లెన్” రాకెట్ పరీక్ష సమయంలో భారీ పేలుడు సంభవించింది. హాట్‌ఫైర్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా రాకెట్ అగ్నిగోళంలా మారి పేలిపోవడంతో అక్కడి ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిలియనీర్ జెఫ్ బేజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ చేపట్టిన న్యూ గ్లెన్ రాకెట్ పరీక్ష విఫలమైంది. లాంచ్ ప్యాడ్‌లో న్యూగ్లెన్ రాకెట్ పేలింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని బ్లూ ఆరిజన్ కంపెనీ తెలిపింది.
అయితే, ప్రయోగ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రయోగం సమయంలో రాకెట్ కింద భాగం నుంచి పొగ వచ్చినట్లు కనిపించింది. సుమారు 98 మీటర్ల ఎత్తు ఉన్న ఆ రాకెట్ భారీ స్థాయి పేలుడంతో ఫైర్ బాల్ ఏర్పడింది.
తాజా ఘటనపై.. బ్లూ ఆరిజిన్ ఎక్స్‌లో స్పందించింది.. “ఈరోజు హాట్‌ఫైర్ పరీక్ష సమయంలో మేము ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నాము. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. మాకు మరింత సమాచారం తెలిసిన తర్వాత, తాజా వివరాలను అందిస్తాము” అని పేర్కొంది.
Jeff Bezos backed Blue Origin faces setback as New Glenn rocket explodes during testing. pic.twitter.com/yPdhSAmO3M
— @Sky (@Sky_Tradez_) May 29, 2026
నాసా, బ్లూ ఆరిజిన్ కలిసి ఆర్టెమిస్ చంద్రయాన్ మిషన్ల కోసం లూనార్ ల్యాండర్ అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఘటనతో బ్లూ ఆరిజిన్ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భవిష్యత్ అంతరిక్ష వాణిజ్య, చంద్రయాన్ మిషన్లలో న్యూ గ్లెన్ రాకెట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రయాణికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
