Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్కుతో మరోసారి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

తాజాగా మరో స్నేహితుల మద్య గొడవ పెట్టాడు బిగ్ బాస్. మానస్, సన్నీలు బిగ్ బాస్ కి రాకముందు సీరియల్స్ నుంచి కూడా స్నేహితులు. బిగ్ బాస్ కి వచ్చాక కూడా ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ

Bigg Boss 5 :  కెప్టెన్సీ టాస్కుతో మరోసారి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

Bb5

Bigg Boss 5 :  బిగ్ బాస్ ఎక్కువగా ఉండేవే గొడవలు. ఇందులో కంటెస్టెంట్స్ కొంతమంది గ్రూపులుగా ఉండి ఆటని ఆడతారు. ఫ్రెండ్స్ గా ఉంటారు కొంతంది కంటెస్టెంట్స్. కానీ బిగ్ బాస్ తలుచుకుంటే ఆ స్నేహితుల మధ్య కూడా చిచ్చు పెట్టగలడు. చిత్ర విచిత్రమైన టాస్కులతో సభ్యుల మధ్య గొడవలు పెడతాడు బిగ్ బాస్. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో సిరి షన్ను మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటాడు. అయినా వాళ్లిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. తాజాగా మరో స్నేహితుల మద్య గొడవ పెట్టాడు బిగ్ బాస్. మానస్, సన్నీలు బిగ్ బాస్ కి రాకముందు సీరియల్స్ నుంచి కూడా స్నేహితులు. బిగ్ బాస్ కి వచ్చాక కూడా ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ వీళ్ళిదారి మధ్య గొడవ పెట్టాడు.

Puneeth Rajkumar : పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మాన‌స్ త‌న‌కు ద‌క్కిన గొడ్డ‌లిని స‌న్నీకి ఇచ్చాడు. దీంతో స‌న్నీని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి బిగ్‌బాస్ అత‌డికి ఒక స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇచ్చాడు. ఒక‌రి నుంచి స‌గం బంగారు ముత్యాల‌ను తీసుకుని ఇంకొక‌రికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో స‌న్నీ, సిరి ద‌గ్గ‌ర నుంచి గోల్డ్‌ను తీసుకొని ష‌ణ్ముఖ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత మొద‌టి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక‌, మాన‌స్‌ల‌కు బెలూన్ టాస్క్ ఇవ్వ‌గా అందులో ప్రియాంక గెలిచింది.

Shalu Chaurasia : ఫోన్ మాత్రమే కాదు డైమండ్ రింగ్ కూడా ఎత్తుకెళ్లారు.. లైంగిక దాడికి యత్నించాడు : చౌరాసియా

రెండో రౌండ్‌లో స‌న్నీ, సిరి బంగారం వెతకడంలో టాప్‌లో ఉన్నారు. అయితే వీళ్లిద్ద‌రిలో ఒక‌రికే కెప్టెన్సీ కంటెండ‌ర్ అయ్యే ఛాన్స్ ఉందని మరో టాస్క్ ఇచ్చి సిరి త‌ర‌పున వేరొక‌రు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి త‌న‌కోసం మాన‌స్ పోటీప‌డ‌తాడ‌ని చెప్పింది. అలా సన్నీ మానస్ లు పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో మానస్ గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండ‌ర్‌ను చేశాడు.

RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

అయితే ఈ గేమ్ లో రూల్స్ త‌న‌కు ముందే స‌రిగా చెప్ప‌లేదంటూ ర‌వి మీద ఫైర్ అయ్యాడు స‌న్నీ. అలాగే త‌న స్నేహితులు మాన‌స్‌, కాజ‌ల్ మీద కూడా సీరియస్ అయ్యాడు. తన కోపాన్ని త‌గ్గించుకునేందుకు స‌న్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇలా సన్నీ.. మానస్, కాజల్ తో ఈ కెప్టెన్సీ టాస్కులో గొడవ పడ్డాడు. మరి సిరి, షన్ను లాగా మళ్ళీ వెంటనే కలిసిపోతారా లేదా సన్నీ ఈ కోపాన్ని కంటిన్యూ చేస్తాడా చూడాలి.