హీరోగా జానీ మాస్టర్..

10TV Telugu News

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నారు.. జానీ మాస్టర్, ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా.. సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళి రాజ్ తియ్యాన దర్శకత్వంలో.. కె.వెంకట రమణ నిర్మిస్తున్న చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది.
జానీ, దిగంగనాలపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కు క్లాప్ నివ్వడంతో పాటు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్బంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ‘‘హీరోగాఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెప్పలేను. నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు షూటింగ్ లేనప్పుడు టీవీ షూటింగ్‌లకు వెళ్తాను. ఇప్పుడు కొరియోగ్రఫీ విషయంలో విరామం దొరికితే సినిమా షూటింగుకు వెళ్తాను. నువ్వు చేయకపోతే సినిమా చేయనని నిర్మాత వెంకట రమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పక్కన నటించడానికి ముందుకొచ్చిన దిగంగనకు థ్యాంక్స్’’ అన్నారు.

Jani Master

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘జానీ మాస్టర్‌తో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ బ్రిల్లియెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు నా నిర్మాత, దర్శకులు, రచయితలకు ధన్యవాదాలు’’ అన్నారు.

‘జె 1’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి కెమెరా : శ్యామ్ కె నాయుడు, సంగీతం : రధన్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : పి.వి.రాజు, నిర్మాణం : కె.వెంకట రమణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మురళి రాజ్ తియ్యాన.

Jani Master