Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

చూస్తుండగానే వందలలో వచ్చే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఇక్కడ అక్కడ అని లేకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా..

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

Film Celebrities

Film Celebrities: చూస్తుండగానే వందలలో వచ్చే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఇక్కడ అక్కడ అని లేకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఆయా రాష్ట్రాలలో ఆంక్షలు అమలవుతున్నాయి. దక్షణాదిన కూడా కొన్ని రాష్ట్రాలలో కరోనా ఉదృతంగా వ్యాపిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులను బట్టి తెలుస్తుంది. కాగా.. గత రెండు వేవ్ ల మాదిరి ఈ వేవ్ లో సినిమా సెలబ్రిటీలు ఎక్కువగానే వైరస్ బారినపడుతున్నారు.

Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్.. మధ్యలో కోలీవుడ్ అన్ని బాషలలో సినీ సెలబ్రిటీల పరిస్థితి ఇలాగే ఉంది. గత వారం రోజుల్లోనే మన టాలీవుడ్ లో అనేక మంది స్టార్స్ కు కరోనా పాజిటివ్ గా తేలడం మరింత కలవరపెడుతుంది. రీసెంట్‌గా మ‌హేష్ బాబు క‌రోనా బారిన పడగా.. మంచు మనోజ్, మంచు ల‌క్ష్మీ, విశ్వ‌క్ సేన్, హీరో నితిన్ భార్య, వరలక్ష్మి శరత్ కుమార్ సహా మరికొందరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణయింది. కోలీవుడ్ లో కూడా వైరల్ బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతుంది.

AP Cinema Ticket Price Issue : ఏపీ సినిమా టికెట్ రేట్లపై రచయిత బుర్ర సాయిమాధవ్ వ్యాఖ్యలు

బాహుబలితో కట్టప్పగా విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్, హీరోయిన్ త్రిష కరోనా బారిన పడినట్లు ప్రకటించగా.. మరికొంతమంది ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో అయితే ఇది మరీ దారుణ పరిస్థితి. సెలబ్రిటీల కుటుంబాలకు కుటుంబాలు కరోనా వలలో చిక్కుతున్నారు. దీంతో ఇప్పుడు మరింత స్థాయిలో వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి గతంలో తెలుగు నటీనటులకు ఈ స్థాయిలో వైరల్ సోకలేదు. కానీ.. థర్డ్ వేవ్ కన్నా ముందే మన ఇండస్ట్రీ నుండి ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారు.