Prabhas 25: ప్రభాస్ హీరోయిన్‌పై క్యూరియాసిటీ.. ఛాన్స్ దక్కేది ఎవరికో?

ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ 5 సినిమాల్ని లైన్లో పెట్టిన ప్రభాస్ తన సినిమాలతో పాటు హీరోయిన్లను కూడా డిఫరెంట్ గా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటి..

Prabhas 25: ప్రభాస్ హీరోయిన్‌పై క్యూరియాసిటీ.. ఛాన్స్ దక్కేది ఎవరికో?

Prabhas 25

Prabhas 25: ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ 5 సినిమాల్ని లైన్లో పెట్టిన ప్రభాస్ తన సినిమాలతో పాటు హీరోయిన్లను కూడా డిఫరెంట్ గా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ వర్క్ చెయ్యని హీరోయిన్లతో, స్పెషల్లీ బాలీవుడ్ హీరోయిన్లనే ఎక్కువ సెలక్ట్ చేసుకుంటున్న ప్రభాస్.. సందీప్ రెడ్డితో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని సెలక్ట్ చేస్కోబోతున్నారు?

Big Boss 5: ఐదు వారాలకు హమీదా రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రభాస్ సినిమాల విషయంలో ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరోకీ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మూడు సినిమాల షూటింగ్స్ కే షటిల్ సర్వీస్ చేస్తున్న ప్రభాస్.. లేటెస్ట్ గా తన 25వ సినిమాని అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి తో చేస్తున్న సినిమాలో ప్రభాస్ కి జంటగా ఏ హీరోయిన్ చెయ్యబోతోందన్న ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ లో హీరోయిన్ గా బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న పూజాహెగ్డేతో సినిమాని కావల్సినంత హైప్ తీసుకొచ్చారు ప్రభాస్.

Prabhas: చేతినిండా సినిమాలు.. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు?

ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చెయ్యడంతో బాలీవుడ్ ని కవర్ చెయ్యడానికి అక్కడ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ నే సెలక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మంబయిలో ఓమ్ రౌత్ తో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ చేస్తోంది. రాముడి రోల్ చేస్తున్న ప్రభాస్ తో సీతగా కనిపించబోతోంది ఈ హీరోయిన్.

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

నాగాశ్విన్ తో, వైజయంతీమూవీస్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ప్రభాస్ మూవీలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నే సెలక్ట్ చేశారు. బాలీవుడ్ లో అలాంటి ఇలాంటి హీరోయిన్ ని కాదు.. ఏకంగా స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ని తెలుగులోకి రప్పిస్తున్నారు ప్రభాస్. హిందీలో టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకోన్ నాగాశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ సై ఫై మూవీ చేస్తోంది.

Prabhas: రెబల్ స్టార్ సినిమాల లైనప్.. సాహో అనాల్సిందే!

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా సలార్ లో కూడా ప్రభాస్ బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్ హీరోయిన్ శ్రుతి హాసన్ నే సెలక్ట్ చేసుకున్నారు. సౌత్ స్టార్ అయినా కూడా బాలీవుడ్ లో చేసిన సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శ్రుతి హాసన్. హిందీ మార్కెట్ ని పుల్ చెయ్యగల హీరోయిన్ అవ్వడంతో పాటు ప్రభాస్, శ్రుతిహాసన్ పెయిర్ కొత్తగా ఉండడంతో సినిమా మీద క్రేజ్ పెరిగిపోతోంది. ఇలా వరుసగా బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లని సెలక్ట్ చేస్తున్న ప్రభాస్.. సందీప్ సినిమాలో ఎవర్ని సెలక్ట్ చేస్తారా అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.