Prabhas: చేతినిండా సినిమాలు.. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు?

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్..

Prabhas: చేతినిండా సినిమాలు.. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు?

Prabhas: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. నెక్ట్స్ సమ్మర్ కు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తీసుకురానున్నాడు. మరోవైపు సలార్ ని స్పీడప్ చేస్తూనే నాగశ్విన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇవి కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ సినిమాకు ముహూర్తం పెట్టేశాడు.

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

రాధేశ్యామ్ నుండి స్పిరిట్ వరకు ప్రస్తుతం అరడజను సినిమాలతో ప్రభాస్ ఊపిరి సలపనంతగా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు కథల దశలో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ కూడా జరుగుతుంది. వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు సిద్ధం చేస్తున్న ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ముందు వరసలో ఉన్నాడు.

Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

ప్రస్తుతం ప్రభాస్ వయసు 41.. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి ఆలోచన చేయడం లేదా అని ఆయన అభిమానులు ఆవేదనలో ఉన్నారు. ఆ మధ్య ఇదిగో ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగేది. కానీ.. ఈ మధ్య కాలంలో ఎక్కడా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడమే లేదు. ఎటు చూసినా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండడంతో ఇటు సోషల్ మీడియా కూడా ఆయన పెళ్లి ప్రస్తావన మర్చిపోయింది. అయితే.. ఆయన అభిమానులకు మాత్రం తమ అభిమాన హీరో పెళ్లి చూడాలని ఎంతో ఆతృతలో ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభాస్ వారి విన్నపాలు ఆలకిస్తాడా? అన్నది చూడాలి.