RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ జాతీయ జెండా నీళ్లల్లో పడకుండా బ్రిడ్జిపై నుండి పట్టుకునే షాట్ అద్భుతం అసలు..

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

Ss Rajamouli

RRR Glimpse: గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌లు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

45 సెకన్ల గ్లింప్స్‌తో జక్కన్న మరోసారి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. అసలు కను రెప్పపాటులో రాకెట్ స్పీడ్‌తో కట్ చేసిన షాట్స్ చూస్తే మతి పోతుంది. మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో మ్యాజిక్ చెయ్యబోతున్నారనిపించింది. విజువల్స్, ఆర్ఆర్ గూస్ బంప్స్ అసలు.

RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

ముఖ్యంగా తారక్ – చరణ్‌ల ట్రాన్స్ఫర్మేషన్ అదుర్స్ అనిపించింది. గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అరుపులు అనిపించాయి. మరీ ముఖ్యంగా నీళ్లల్లో పడిపోతున్న జాతీయ జెండాను యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పట్టుకోవడం.. అదికూడా బ్రిడ్జికి చెరోవైపు. కాలిపోతున్న జెండాను నీటితో ఆర్పడానికి చరణ్, తారక్ నీళ్లల్లోకి దూకుతున్నారు. ఈ షాట్ ద్వారా  దేశభక్తి గురించి చెప్తూనే ఇద్దరు హీరోలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన జక్కన్న ఆలోచనా విధానానికి హ్యాట్సాఫ్ అసలు. (బ్రిడ్జ్ మీద చరణ్ గుర్రం, తారక్ బుల్లెట్ చూపించారు)..

RRR Glimpse : అసలు కథ ముందుంది..

చరణ్ ఓవైపు జెండాను, తారక్ జెండాకున్న తాడును మరోవైపు పట్టుకుని బ్రిడ్జిపై నుండి నీళ్లల్లోకి దూకుతుంటే.. థియేటర్లలో ఇద్దరు హీరోల అభిమానులు సీట్లు చింపడం పక్కా అని చెప్పొచ్చు. గ్లింప్స్‌తోనే గూస్ బంప్స్ తెప్పించిన రాజమౌళి.. ఇక టీజర్, ట్రైలర్‌తో ఇంకెన్ని షాకులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తారో చూడాలిమరి.