High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

భారీ బడ్జెట్ పెట్టినా.. భారీ ఎత్తున సెట్లు వేసినా.. ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా.. అసలు సినిమా మాత్రం హిట్ కావట్లేదు. హిట్ కాదు సరికదా.. అసలు మినిమమ్ గ్యారంటీ లేకుండా పోయింది.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

High Budget Movies

High Budget Movies: భారీ బడ్జెట్ పెట్టినా.. భారీ ఎత్తున సెట్లు వేసినా.. ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా.. అసలు సినిమా మాత్రం హిట్ కావట్లేదు. హిట్ కాదు సరికదా.. అసలు మినిమమ్ గ్యారంటీ లేకుండా పోయింది. అంచనాలు ఎలా ఉన్నా.. స్టార్‌ ఇమేజ్‌ ఎంతటిదైన సినిమా సక్సెస్‌ అయితేనే కలెక్షన్లు.. లేదంటే భారీ నష్టాల్లు తప్పవు. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ అయ్యాయి.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రేంజ్ లో గ్రాండ్ విజువల్స్, భారీ స్టార్ కాస్ట్ తో రెట్రో డ్రామాగా తెరకెక్కిన సినిమా కళంక్. 150 కోట్ల బడ్జెట్ తో సంజయ్ దత్, మాధురి దీక్షిత్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అభిషేక్ వర్మన్. 2014లో ఫస్ట్ టైమ్ చేసిన 2 స్టేట్స్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందనుకున్నారు అందరూ. కానీ ఇంతటి పెద్ద సినిమాని తెరకెక్కించి ఆడియన్స్ కి సరిగా రీచ్ చెయ్యడంలో సక్సెస్ కాలేక సినిమా నష్టాల్ని ఫేస్ చెయ్యడానికి రీజన్ అయ్యారు అభిషేక్.

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

షారూఖ్ ఖాన్ సినిమాకే తప్పలేదు ఇలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్. షారూఖ్ సరికొత్త గెటప్ లో చేసిన ఫాన్ మూవీతో పాటు జీరో సినిమా కెరీర్ లో గట్టి దెబ్బలే కొట్టాయి. తెలుగులో శేఖర్ కమ్ముల లా అప్ కమింగ్ యంగ్ హీరోలతో సినిమాలు చేసే ఆనంద్ ఎల్ రాయ్.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తో జీరో అనే భారీ సినిమా చేశారు. గెటప్ వైజ్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించిన షారూఖ్ కి ఆనంద్ సరైన హిట్ ఇవ్వలేకపోయారు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4 ఏళ్ల నుంచి సినిమా రిలీజ్ చెయ్యలేదు షారూఖ్.

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

గురు, రావన్, ధూమ్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య.. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ని మాత్రం హ్యాండిల్ చెయ్యలేకపోయారు. హాలీవుడ్ యాక్టర్లతో పైరేట్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ థగ్స్ అఫ్ హిందుస్థాన్.. అమీర్, అమితాబ్ ఫాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. డైరెక్టోరియల్ ఎఫీషియన్సీ లేకపోవడంతో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏమాత్రం గ్రాండియర్ ని చూపించలేక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.