Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్.. ఏ ఇద్దరు కనిపించినా ప్రేమ గురించే మాట్లాడుకుంటారు.. ప్రేమికుల రోజున ఎక్కడ చూసినా ప్రేమమాటలు.. ప్రేమ పాటలే వినిపించాయి. ఇక సినిమాల్లో మన హీరోలైతే హీరోయిన్..

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

Tollywood Love Stories

Tollywood Love Stories: లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్.. ఏ ఇద్దరు కనిపించినా ప్రేమ గురించే మాట్లాడుకుంటారు.. ప్రేమికుల రోజున ఎక్కడ చూసినా ప్రేమమాటలు.. ప్రేమ పాటలే వినిపించాయి. ఇక సినిమాల్లో మన హీరోలైతే హీరోయిన్ కనిపించగానే.. లవ్ సాంగేసుకుంటారు. టాలీవుడ్ సినిమాల్లో ప్రేమ ఎప్పుడూ మునిగితేలుతూనే ఉంటుంది. ఎన్ని యాక్షన్ సినిమాలు చేసినా లవ్ అనేది యూనివర్శల్ సబ్జెక్ట్ కాబట్టి.. కంపల్సరీ గా లవ్ ట్రాక్ పెట్టుకుంటారు హీరోలు.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

ఈమధ్య తన సినిమాలతో జాతికి కాస్త సీరియస్ గానే సందేశాలిస్తున్న మహేష్ బాబు కంప్లీట్ గా లవర్ బాయ్ గా మారిపోయి క్యూట్ గా తన గర్ల్ ఫ్రెండ్ తో సాంగేసుకుంటున్నారు. సర్కారు వారి పాటలో కళావతి అంటూ కీర్తిసురేష్ తో పాడిన డ్యూయెట్ చూసి లవర్స్ అందరూ కనెక్ట్ అయిపోతున్నారు.

Manchu Vishnu: నాన్నకి ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారు.. స్టార్ల భేటీపై విష్ణు!

లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరసగా యాక్షన్ మూవీస్ చేస్తూ.. కాస్త బ్రేక్ తీసుకుని కంప్లీట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా రాధేశ్యామ్. పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తున్న రాధేశ్యామ్ సినిమాలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన లవ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతకముందు రిలీజ్ అయిన సిద్ శ్రీరామ్ పాడిన నగుమోము తారలే సాంగ్ అయితే ప్రభాస్ రొమాంటిక్ సాంగ్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ సంపాదించుకుంది.

Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలెంటైన్స్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమాలో మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ఉండేలా చూసుకుంటారు. భీమ్లానాయక్ ఎంత మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా.. నిత్యామీనన్ తో పాడిన అంత ఇష్టమేంటయా సాంగ్ ఫాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. సెటిల్డ్ లవ్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నిత్యా, పవన్ పర్ ఫెక్ట్ లవ్ సాంగ్ ప్రజెంట్ చేశారు.