Manchu Vishnu: నాన్నకి ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారు.. స్టార్ల భేటీపై విష్ణు!
మూవీ టికెట్ ధరల తగ్గింపు, థియేటర్ల సమస్యపై ఈ మధ్య టాలీవుడ్ స్టార్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. కాగా.. మోహన్ బాబు, ఆయన కుమారుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు..

Manchu Vishnu
Manchu Vishnu: మూవీ టికెట్ ధరల తగ్గింపు, థియేటర్ల సమస్యపై ఈ మధ్య టాలీవుడ్ స్టార్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. కాగా.. మోహన్ బాబు, ఆయన కుమారుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు విష్ణు కానీ ఆ భేటీకి హాజరుకాలేదు. ఈ విషయంపై అప్పుడు ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమైన సంగతి కూడా తెలిసిందే. కాగా మంగళవారం విష్ణు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. సీఎంతో విష్ణు లంచ్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలంటైన్ డేను సంబరంగా మార్చిన స్టార్స్
స్టార్స్ భేటీకి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు మరికొందరికి కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపగా.. నాగార్జున, ఎన్టీఆర్ ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే.. ఈ భేటీకి మోహన్ బాబుకు కూడా ప్రభుత్వం నుండి ఆహ్వానం రాగా.. అది మోహన్ బాబు వరకు చేరలేదట. ఈ విషయాన్ని జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు వెల్లడించారు. కొందరు కావాలనే నాన్నకి ఆహ్వానం అందకుండా చేశారని.. అయితే.. ఇప్పుడు ఆ విషయాలపై మాట్లాడి మీడియాకి అవకాశం ఇవ్వనని చెప్పారు.
Manchu Vishnu: జగన్ నాకు బావ అవుతారు.. అయినా అన్న అనే పిలుస్తాను -మంచు విష్ణు
సినీపరిశ్రమ అంతా ఒక కుటుంబంలాటిదేనని.. తామంతా కుటుంబసభ్యులం అంటూనే విష్ణు భేటీకి ఆహ్వానం అందకూడా చేశారని చెప్పాడు. ఇక సీఎంతో భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకి వచ్చాయన్న విష్ణు.. మరో వేదికపై వాటి గురించి చెప్తానని చెప్పారు. ఇక.. సీఎంతో భేటీ పూర్తిగా వ్యక్తిగతమన్న విష్ణు.. గతంలో కూడా చాలాసార్లు సీఎంను కలిశానని.. అయితే.. ఎప్పుడెప్పుడు ఇంతగా అటెన్షన్ లేదని.. ఇప్పుడు ఇండస్ట్రీలో సమస్య మూలంగానే మీడియా ఫోకస్ చేస్తుందని.. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతమైన మీటింగ్ మాత్రమేనన్నారు.