Release Postpone: సర్వం సిద్ధం.. కానీ.. తప్పని రిలీజ్ డేట్స్ రీ షెడ్యూల్

రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైమ్ సెట్ చేసుకుని, మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. షూటింగ్ లేట్ అయ్యిందనో, పెద్ద సినిమాలతో..

Release Postpone: సర్వం సిద్ధం.. కానీ.. తప్పని రిలీజ్ డేట్స్ రీ షెడ్యూల్

Release Postpone

Release Postpone: రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైమ్ సెట్ చేసుకుని, మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. షూటింగ్ లేట్ అయ్యిందనో, పెద్ద సినిమాలతో పోటీ ఎందుకనో.. సినిమాలు రిలీజ్ లన్నీ రీషెడ్యూల్ చేసుకుంటున్నాయి. చకచకా సినిమాల్ని కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి.

Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

గని మూవీ అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం డిసెంబర్ 24న రిలీజ్ అయిపోయి ఉండాల్సింది. కానీ.. వేరే సినిమాలు రిలీజ్ కు ఉండడంతో వరుణ్ తేజ్ ఈ సినిమాని ఏకంగా మార్చి 18కి రిలీజ్ చేస్తున్నారు టీమ్. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీని స్టార్ట్ చేసినప్పుడే క్రిస్ మస్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ ఇంట్రస్టింగ్ మూవీ.. రిలీజ్ డేట్ మారినా.. ధీమా, దర్జా, దూకుడు మారదు అంటూ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు మేకర్స్.

Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతి బరిలోకి దిగుతామని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన ఎఫ్ 3.. పెద్ద సినిమాలతో లేనిపోని రిస్క్ ఎందుకుని తప్పుకుంది. జనవరి నుంచి ఫిబ్రవరి 25కు షిఫ్ట్ అయిన ఆ సినిమా.. భీమ్లానాయక్ అడ్డురావడంతో మరోసారి డేట్ రీషెడ్యూల్ చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈసినిమా రిలీజ్ ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 29కి పోస్ట్ పోన్ అయ్యింది.

NTR 30: బాలీవుడ్ బ్యూటీలు కాదు.. సామ్‌ను లాక్ చేసిన కొరటాల?

కీర్తిసురేష్, ఆదిపినిశెట్టి లీడ్ రోల్స్ లో చేస్తున్న గుడ్ లక్ సఖి మూవీ కూడా సమ్మర్ నుంచి నవంబర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి మరోసారి డేట్ మార్చుకుంది. లాస్ట్ కి ఈఇయర్ ఎండ్ డిసెంబర్ 31న సినిమా ధియేటర్లోకి వస్తోంది. ఇలా ఒక్కో సినిమా డేట్స్ ఇవ్వడం ఆ టైంకి ఏదొక కారణంతో వాయిదా పడడం చాలా కామన్ అయిపోతుంది.