F3: ట్రైలర్ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీగా ఎఫ్3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది..

F3: ట్రైలర్ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

F3 Trailer Runtime Locked

F3: టాలీవుడ్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీగా ఎఫ్3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి పూర్తి కామెడీ జోనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో ఎఫ్2లోని నటీనటులు అందరూ నటిస్తుండగా, కొత్తగా సోనాల్ చౌహాన్, సునీల్ జాయిన్ అయ్యారు.

F3: మరో సీక్వెల్ రెడీ అంటోన్న అనిల్ రావిపూడి..?

ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే తాజాగా ఈ ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేశారు చిత్ర నటీనటులు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్విస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ ట్రైలర్ రన్‌టైమ్ 2 నిమిషాల 32 సెకన్లుగా కట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

F3: ఎఫ్3 నుండి సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పీర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.