Tollywood Hero’s: కలిసి వస్తున్న తండ్రి కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

వచ్చే ఏడాది కాచుకో అంటున్నారు టాలీవుడ్ తండ్రీకొడుకులు. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు కలిసి వస్తామంటున్నారు. అస్సలు ఇప్పట్లో ఎక్స్ పెక్ట్ చేయని నెవర్ బిఫోర్ కాంబోస్ వచ్చే ఏడాది..

Tollywood Hero’s: కలిసి వస్తున్న తండ్రి కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

Tollywood Hero's

Tollywood Hero’s: వచ్చే ఏడాది కాచుకో అంటున్నారు టాలీవుడ్ తండ్రీకొడుకులు. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు కలిసి వస్తామంటున్నారు. అస్సలు ఇప్పట్లో ఎక్స్ పెక్ట్ చేయని నెవర్ బిఫోర్ కాంబోస్ వచ్చే ఏడాది సందడి చేయబోతున్నాయి. స్టార్ డం ఉన్న తండ్రీకొడుకులను ఒకే ప్యాకేజ్ లో ప్లాన్ చేసి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. 2022 మాదే అంటున్నారు టాలీవుడ్ తండ్రీకొడుకులు. వేరే స్టార్స్ తో నటించడానికి ఓకే కానీ కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఫీలయ్యేది మాత్రం ఫ్యామిలీ హీరోలతోనే. అదీ స్టార్ తండ్రీకొడుకులైతే ఆ మజానే వేరు. అందుకే మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల్లో ఈ తరహా మల్టీస్టారర్స్ వెంటనే షూట్ కెళ్లిపోతున్నాయి.

ఇప్పుడలాంటి కాంబో ప్యాక్స్ సెట్స్ ఫై జోరుగా ఉన్నాయి. అటు నందమూరి ఫ్యామిలీ హీరోలు కూడా కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెబల్ స్టార్స్ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కు పండుగే. అందుకే గతంలో డార్లింగ్ తన పెద్దనాన్నతో కలిసి కనిపించినా మరోసారి రాధేశ్యామ్ తో రాబోతుంటే ఖుషీ అవుతున్నారు అభిమానులు. విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తే.. పరమహంస క్యారెక్టర్ లో కృష్ణంరాజు ఫిక్సయ్యారు. ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ రోల్ ను ఎలివేట్ చేయబోయేది కృష్ణంరాజు క్యారెక్టరే అని అర్ధమవవుతోంది. ఇలా ఉప్పలపాటి సీనియర్ రెబల్ స్టార్.. ప్రెజెంట్ గ్లోబల్ స్టార్ తో కలిసి అందరి కంటే ముందు ఈ డ్యుయో కాంబోతో 2022 సంక్రాంతికి వచ్చేస్తున్నారు.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

మెగాఫ్యాన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ ఆచార్య. ఎందుకంటే చిరూ – చరణ్ ఫుల్ లెంత్ రోల్స్ లో కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇంతకుముందు ఒకే స్క్రీన్ పై ఈ తండ్రికొడుకులని చూశాం.. కానీ ఏదో ఐదో, పది నిమిషాలు కలిసి కనిపించడం వరకే. అయితే ఆచార్య మల్టీస్టారర్ లెవెల్ లో.. ఇద్దరికీ దాదాపు ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇస్తూ తెరకెక్కిన సినిమా. చరణ్ రోల్ గురించి డైరెక్ట్ గా డైరెక్టర్ కొరటాల శివ అనౌన్స్ చేశారు కూడా. అందుకే రిలీజ్ డేట్ ఫిబ్రవరి 4 కోసం.. ఆచార్య కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. ఇక అతిత్వరలో వీళ్లిద్దరికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయబోతుంది ఆచార్య టీమ్.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

మనం తర్వాత అక్కినేని తండ్రీకొడుకులు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తోన్న మూవీ బంగార్రాజు. రీసెంట్ గానే ఈ మూవీ రెగ్యులర్ షూట్ కూడా కంప్లీటయింది. వేరే హీరోలతో ఊపిరి, దేవదాస్ వంటి మల్టీస్టారర్స్ చేసిన నాగ్.. రీసెంట్గా బాలీవుడ్ బ్రహ్మాస్త్రలోనూ నటించారు. ఇటు వెంకీమామతో ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసుకున్న చై.. ఈమధ్యే అమీర్ లాల్ సింగ్ చద్దాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అయితే ఫన్నీ రోల్స్ తో తండ్రీకొడుకులు మళ్లీ రాబోతున్నది మాత్రం బంగార్రాజుతోనే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ ఇద్దరు సోగ్గాళ్లు వచ్చేది సంక్రాంతికే అంటున్నారు.

Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!

దగ్గుబాటి సీనియర్ స్టార్ వెంకటేశ్.. అల్లుడు నాగచైతన్యతో వెంకీమామ చేసేశాడు. అయితే బాబాయ్ – అబ్బాయ్ అంటే వెంకీ, రానా కాంబో గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. సినిమా అయితే చేయట్లేదు కానీ నెట్ ఫ్లిక్స్ కోసం వీళ్లిద్దరూ కలిసి పాన్ ఇండియా లెవల్లో రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ 2022లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక మంచి కథ దొరికితే రానా – వెంకీ – చై కాంబినేషన్ లో సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చనీ చెప్పారు.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

నందమూరి హీరోలు బాబాయ్, అబ్బాయ్.. బాలకృష్ణ, తారక్ లను ఒకే స్క్రీన్ పై చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అది సాధ్యపడట్లేదు. అయితే సినిమా కాదు కానీ త్వరలో జరుగబోయే ట్రిపుల్ ఆర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో వీళ్లిద్దరిని కలిపి చూసే ఛాన్స్ వచ్చేలా ఉంది. ట్రిపుల్ ఆర్ హై స్వింగ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి.. చరణ్ తరపున మెగాస్టార్ చిరంజీవిని.. తారక్ తరపున నందమూరి బాలయ్యను గెస్ట్ లుగా సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ముందు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ బంపర్ హిట్ కావడం ఖాయం.