Films Re-Shoot: రీ షూట్.. ప్యాకప్ చెప్పిన సినిమాలకు మళ్ళీ ప్యాచప్!

ఫస్ట్ కోవిడ్ టైమ్ లో మొదలుపెట్టిన సినిమాలు.. అప్పుడప్పుడు షూటింగ్ కి బ్రేక్ వచ్చినా.. షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. సెకండ్ కోవిడ్ టైమ్ కి రిలీజ్ డేట్స్ కూడా అ

Films Re-Shoot: రీ షూట్.. ప్యాకప్ చెప్పిన సినిమాలకు మళ్ళీ ప్యాచప్!

Films Re Shoot

Films Re-Shoot: ఫస్ట్ కోవిడ్ టైమ్ లో మొదలుపెట్టిన సినిమాలు.. అప్పుడప్పుడు షూటింగ్ కి బ్రేక్ వచ్చినా.. షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. సెకండ్ కోవిడ్ టైమ్ కి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ కాదుకదా.. ఆ పాత సినిమాలకే రెన్నోవేషన్ స్టార్ట్ చేసి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు మేకర్స్. మళ్లీ షూట్ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ రీల్ సిద్ధం చేస్తున్నారు.

Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

సినిమాలను చెక్కే పనిలో ఉన్నారు మన దర్శక శిల్పులు. కోవిడ్ కు ముందు కంప్లీట్ అయిన సినిమాల దుమ్ముదులిపి మళ్లీ వాటికి రంగులద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కేజేఎఫ్ 2 షూటింగ్ పని స్టార్ట్ చేశారు హీరో యష్. ప్రశాంత్ నీల్ హీరోగా కెజిఎఫ్ కి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ 2 మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయిందనుకన్నా.. ఇంకా సినిమా ప్యాచప్ సీన్స్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు టీమ్. లేటెస్ట్ గా ఈ షూట్ కి సంబంధించి ఫోటో రిలీజ్ చేశారు యష్.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

చిరంజీవి కూడా అయిపోయిందనుకున్న ఆచార్య సినిమాని మళ్లీ మొదలుపెట్టారు. కొరటాలశివ డైరెక్షన్లో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయింది..ఇక రిలీజే లేటనుకున్నారు అంతా. అయితే మొన్నీమధ్య వచ్చిన అఖండ దెబ్బకి మళ్లీ సినిమాకు బెటర్ మెంట్స్ తో పాటు.. మరికొన్ని సీన్స్ ఎఫెక్టివ్ గా షూటింగ్ చేస్తున్నారు టీమ్.

Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!

సంవత్సరంన్నర క్రితం రిలీజ్ అవ్వాల్సిన విరాటపర్వం సినిమాని కూడా ఇంకా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ వేణు ఊడుగుల. రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టోరీ విరాటపర్వం.. అప్పట్లో కంప్లీట్ అయిపోయిందని.. రిలీజ్ కోసమే వెయిట్ చేస్తుందని అన్నారు. కానీ రెండు కోవిడ్ లు వెళ్లిపోయినా.. ఇంకా సినిమా మాత్రం రిలీజ్ కాకుండా షూటింగ్ పనులు చేస్తూనే ఉంది.