Fire Boltt Supernova Smartwatch : ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Fire-Boltt Supernova Smartwatch : ప్రముఖ వేరబుల్ స్మార్ట్‌వాచ్ కంపెనీల్లో ఒకటైన ఫైర్-బోల్ట్ (Fire-Boltt) భారత మార్కెట్లో మరో స్మార్ట్‌వాచ్ ఫైర్-బోల్ట్ సూపర్‌నోవాను రిలీజ్ చేసింది.

Fire Boltt Supernova Smartwatch : ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Fire-Boltt Supernova smartwatch launched in India_ Check price, features, more

Fire Boltt Supernova Smartwatch : ప్రముఖ వేరబుల్ స్మార్ట్‌వాచ్ కంపెనీల్లో ఒకటైన ఫైర్-బోల్ట్ (Fire-Boltt) భారత మార్కెట్లో మరో స్మార్ట్‌వాచ్ ఫైర్-బోల్ట్ సూపర్‌నోవాను రిలీజ్ చేసింది. అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో కూడిన AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్-కాలింగ్ సౌకర్యంతో వస్తుంది. Fire-Boltt Supernova స్మార్ట్ వాచ్ ధర 3,499 ధరతో అందుబాటులో ఉంది. ఈ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, లైట్ గోల్డ్, గోల్డ్ బ్లాక్ అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఫైర్- బోల్ట్ ఫీచర్లు ఇవే :
ఫైర్ -బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. గరిష్టంగా 500 నిట్‌ల ప్రకాశంతో 368×448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. స్వ్కైయిర్ డయల్ డిజైన్‌తో వస్తుంది. స్లీక్ మెటాలిక్ బాడీతో పాటు షేప్ పట్టీని కలిగి ఉంటుంది. నావిగేషన్ కోసం పూర్తిగా ఫంక్షనల్ ఆప్షన్లతో వచ్చింది.

Read Also : Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!

Fire-Boltt స్మార్ట్‌వాచ్ ఫిట్‌నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు 123 వివిధ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0ని అందిస్తుంది. కాల్ చేసేందుకు కలిపి మైక్రోఫోన్, స్పీకర్‌ను కలిగి ఉంది. ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ గేమ్‌లు, విభిన్న వాచ్ ఫేస్‌లు, ఎనిమిది యూజర్ ఇంటర్‌ఫేస్ స్టైల్స్‌తో వస్తుంది.

Fire-Boltt Supernova smartwatch launched in India_ Check price, features, more

Fire Boltt Supernova smartwatch launched in India

ఫీచర్ల పరంగా, Fire-Boltt Supernova అధునాతన హెల్త్ మానిటరింగ్ సూట్‌ను కలిగి ఉంది. డైనమిక్ హృదయ స్పందన రేటు, స్లీప్ ట్రాకింగ్, SPO2 మరిన్ని వంటి అనేక ఇండికేషన్లను ట్రాక్ చేస్తుంది. అదనంగా, స్మార్ట్ వాచ్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్, వాటర్ తాగడానికి రిమైండర్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, ఇతర స్మార్ట్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫైర్-బోల్ట్ సూపర్‌నోవా 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. నీటి నిరోధకత కోసం P67-రేటింగ్‌తో వస్తుంది.

ఇటీవల భారత మార్కెట్లో Fire Pods Ninja 601 గేమింగ్ TWS ఇయర్‌బడ్‌లను ప్రవేశపెట్టింది. ఈ డివైజ్ ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తుంది. సున్నితమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 40ms వరకు అతి తక్కువకు అందిస్తుందని చెప్పవచ్చు. TWS ఇయర్‌బడ్‌లు ANC, ENC మోడ్‌ను కలిగి ఉంటాయి.

గేమింగ్, కాల్ చేయడం, మ్యూజిక్ వినడం కోసం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఈ డివైజ్‌లో స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి, ప్రయాణంలో ఆడియోను వినేందుకు సాయపడతాయి. ఫైర్ బోల్ట్ Fire Pods Ninja 601 ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 899 ధరతో లిమిటెడ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Fire-Boltt Infinity Smartwatch : ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?