Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!

Best Smartwatches in 2022 : భారతీయ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. 2022 నవంబర్‌లో కౌంటర్‌పాయింట్ అనే పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం.. 2022లో భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌వాచ్ వినియోగదారులు ఉన్నారు.

Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022 : భారతీయ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. 2022 నవంబర్‌లో కౌంటర్‌పాయింట్ అనే పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం.. 2022లో భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌వాచ్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్‌‌వాచ్ వేగంగా వృద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్ల క్రితం వరకు చాలా స్మార్ట్‌వాచ్‌ల ధర రూ. 10వేల కన్నా ఎక్కువగా ఉండేది. దాంతో వినియోగదారులు సరసమైన స్మార్ట్ బ్యాండ్‌లు లేదా ఫిట్‌నెస్ ట్రాకర్‌లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది.

గత కొన్ని ఏళ్లలో నోయిస్, ఫైర్-బోల్ట్ వంటి బ్రాండ్‌లు మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. అందులో చైనా దిగ్గజం షావోమీ (Xiaomi), OnePlus వంటి లెగసీ బ్రాండ్‌లు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా చేశాయి. రూ. 5వేల లోపు వారి సొంత వాచీలను లాంచ్ చేశాయి. అంతే.. రూ. 5వేల లోపు స్మార్ట్‌వాచ్‌లు ఫీచర్-ప్యాక్‌గా అందించాయి. ఆపిల్ వాచ్ (Apple Watch) లేదా గెలాక్సీ వాచ్ (Galaxy Watch Series) సిరీస్ వంటి హై-ఎండ్ వాచ్‌లతో సులభంగా పోటీ పడగలవని తెలుస్తోంది.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022 _ Smartwatches under Rs 5000 that ruled this year

ఈ విభాగంలో చాలా స్మార్ట్‌వాచ్‌లు హెల్త్ డేటాను అందిస్తున్నాయి. చాలా బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు కూడా ఆటోమేటిక్‌గా వర్కవుట్ మోడ్‌ను గుర్తించలేవు. Apple Watches, Fitbits, Garmin స్మార్ట్‌వాచ్‌లతో చేసే విధంగా మీరు ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర విశ్లేషణను పొందలేరని గమనించాలి. అదే సమయంలో, బడ్జెట్ వాచ్‌లు మీ రోజువారీ కార్యాకలాపాలను గుర్తించే ఫీచర్లను అందిస్తాయి. ఉదాహరణకు.. వినియోగదారులు నిద్ర అలవాట్లను ట్రాక్ చేయవచ్చు. కొందరు బ్లూటూత్ ద్వారా వాచ్‌లో కాల్‌లు చేసేందుకు కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి. రెండోది స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో గణనీయంగా సాయపడుతుంది.

మీరు కొత్త స్మార్ట్‌వాచ్‌ని పొందాలని ప్లాన్ చేస్తున్నారా? అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. Fiiber బృందం ఈ ఏడాదిలో రూ. 5,000 లోపు స్మార్ట్‌వాచ్‌లను పరీక్షించింది. అందులో సరైన డివైజ్ కనుగొనడంలో మీకు సాయపడేందుకు లిస్టును అందిస్తోంది. అందులో మీకు నచ్చిన స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

Read Also : Best Smartwatches : ఈ దీపావళికి ఆఫర్లే ఆఫర్లు.. రూ. 5వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. మీకు నచ్చిన వాచ్ కొనుక్కోవచ్చు!

OnePlus నోర్డ్ వాచ్ :
వన్‌ప్లస్ (OnePlus) ఈ ఏడాది భారత మార్కెట్లో మొదటి నార్డ్-సిరీస్ వాచ్‌ని లాంచ్ చేసింది. రూ. 4,999 ధరతో మార్కెట్‌లోకి వచ్చిన అత్యంత విలువైన స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. AMOLED ప్యానెల్‌తో గొప్ప డిస్‌ప్లేతో వస్తుంది. ఇప్పటికే OnePlus స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వారికి ఇది బోనస్ అని చెప్పవచ్చు. OnePlus Nord Watch ఇతర ముఖ్య ఫీచర్లలో మల్టీ వాచ్ ఫేస్‌లు, స్పోర్ట్స్ మోడ్, 10-రోజుల బ్యాటరీ, SpO2, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్, మెన్స్ట్రువల్ ట్రాకర్ ఉన్నాయి.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022 _ Smartwatches under Rs 5000 that ruled this year

రియల్‌మీ వాచ్ 3 :
రియల్‌మి Realme Watch 3 కూడా బెస్ట్ ఆప్షన్. ఆపిల్ వాచ్‌తో సమానంగా పనిచేస్తుంది. రియల్‌మి వాచ్ 3 ఐఫోన్‌తో కూడా బాగా పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా వాచ్, ఐఫోన్‌ను కనెక్ట్ చేసిన తర్వాత వినియోగదారులు నేరుగా కాల్‌లు చేయవచ్చు. కంపెనీ 7-రోజుల బ్యాటరీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సరికాని డేటాను అందిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి డేటాను కేవలం సూచన మాత్రమే అందిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.3,499గా ఉంది.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

అమాజ్‌ఫిట్ బిప్ 3 :
Amazfit GTS సిరీస్ కింద కొన్ని స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్ చేస్తోంది. ఈ వాచ్ ధర రూ. 10వేల కన్నాఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ ఆప్షన్ కోసం చూస్తున్న కస్టమర్లకు Bip సిరీస్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఏడాదిలో Amazfit Bip 3 లాంచ్ అయిన బెస్ట్ వాచ్ మంచి ఫిట్‌ను అందిస్తుంది. దాదాపు కచ్చితమైన ఆరోగ్య డేటాను అందించే డివైజ్‌లలో ఇది ఒకటి. ఈ వాచ్ 10 రోజుల బ్యాటరీ వినియోగాన్ని అందిస్తుంది. ఇది స్లీప్ ట్రాకర్, హృదయ స్పందన రేటు, SpO2, మల్టీ స్పోర్ట్స్ మోడ్‌ల వంటి సాధారణ దృష్టిని ఆకర్షించే ఫీచర్‌లతో వస్తుంది. భారత మార్కెట్లో Amazfit Bip 3 ధర రూ. 3,499గా ఉంది.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Redmi వాచ్ 2 లైట్ :
Xiaomi భారత మార్కెట్లో మల్టీ స్మార్ట్ బ్యాండ్‌లను కలిగి ఉంది. సబ్-బ్రాండ్ Redmi ఈ ఏడాది ప్రారంభంలో Redmi Watch 2 Lite అనే స్మార్ట్ వాచ్-కమ్-ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ప్రారంభించింది. Redmi వాచ్ 2 లైట్ బెనిఫిట్స్ ఏమిటంటే.. స్మార్ట్ బ్యాండ్‌ల బెనిఫిట్స్ అందిస్తుంది. పెద్ద ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఉంటుంది. నిరంతర SpO2 ట్రాకర్, స్ట్రెస్, స్లీప్ మానిటరింగ్, 5ATM వాటర్-రెసిస్టెంట్ బిల్డ్, 120+ వాచ్ ఫేస్‌లు, మెన్స్ట్రువల్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ కలర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ధర రూ. 3,499గా ఉంది.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

ఫైర్-బోల్ట్ రింగ్ 3 :
Realme Watch 3 మాదిరిగానే.. Fire-Boltt Ring 3 బ్లూటూత్ కాలింగ్, మల్టీ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. వినియోగదారులు డయల్‌ని టర్న్ చేయవచ్చు. వాల్‌పేపర్ లేదా వాచ్ ఫేస్‌ని మార్చవచ్చు. వినియోగదారులు వాచ్ లుక్ పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడల్లా కొత్త డిజైన్ ఎంచుకోవచ్చు. స్మార్ట్‌వాచ్ వాయిస్ కూడా అందిస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో బిల్ట్ కాలిక్యులేటర్, గేమ్‌లు, SpO2, హృదయ స్పందన మానిటరింగ్ ఉన్నాయి. రూ. 2,999 ధరలో జాబితాలో ఉన్న చౌకైన వాచీలలో ఒకటిగా చెప్పవచ్చు.

Best in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

Best Smartwatches in 2022_ Smartwatches under Rs 5000 that ruled this year

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5 Best Smartwatches : భారత్‌లో రూ. 2వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. వెంటనే కొనేసుకోండి!