Best Smartwatches : ఈ దీపావళికి ఆఫర్లే ఆఫర్లు.. రూ. 5వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. మీకు నచ్చిన వాచ్ కొనుక్కోవచ్చు!
Best Smartwatches : స్మార్ట్‌వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. దీపావళి పండుగ సందర్భంగా అనేక ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఫెస్టివల్ సీజన్ సమయంలో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్‌లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
Best Smartwatches : స్మార్ట్‌వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. దీపావళి పండుగ సందర్భంగా అనేక ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఫెస్టివల్ సీజన్ సమయంలో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్‌లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మీరు స్మార్ట్‌వాచ్ రూ. 5వేల లోపు ధరకే కొనుగోలు చేయాలంటే చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు, నోటిఫికేషన్‌లను చెక్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తాయి.
అంతేకాదు.. హృదయ స్పందన రేటు (Heart rate track), నిద్ర చక్రం (Sleep Cycle), స్టెప్ కౌంట్, SpO2ని కూడా ట్రాక్ చేయగలవు. ఈ రేంజ్‌లో చాలా వాచ్‌లు బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్‌లతో వచ్చాయి. దీపావళి సమీపిస్తున్నందున స్మార్ట్ ధరించగలిగే ప్రొడక్టులు చాలా వరకు డిస్కౌంట్ అందిస్తున్నాయి. మీరు ఈ దీపావళికి మీ కోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం రూ. 5వేల లోపు స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనకుంటే ఈ లిస్టు మీకోసం అందిస్తున్నాం. ఓసారి లుక్కేయండి.
Realme Watch 3 Pro :
మీరు మోడ్రాన్ Apple Watch లాంటి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? Realme Watch 3 Pro బెస్ట్ ఆప్షన్. AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్‌పై కలర్లు చాలా రిచ్‌గా ఉంటాయి. GPS, బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. Realme వినియోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. గరిష్ట సెట్టింగ్‌లతో బ్యాటరీ ఒక రోజు వరకు తగ్గిపోవచ్చు. ఆపిల్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో కూడా ఈ స్మార్ట్‌వాచ్ పనిచేస్తుంది. Realme Watch 3 Pro ధర రూ. 4,999గా ఉంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
OnePlus Nord Watch :
మీరు OnePlus యూజర్ అయితే.. OnePlus Nord Watch బెస్ట్ ఆప్షన్. ఈ వాచ్ రియల్‌మీ వాచ్ 3 ప్రో మాదిరిగానే కనిపిస్తుంది, కానీ కుడి వైపున క్రౌన్ మాదిరిగా ఉంటుంది. నిర్మాణ క్వాలిటీ కొంచెం బలంగా ఉంది. 10-రోజుల బ్యాటరీ లైఫ్, AMOLED డిస్‌ప్లేను కూడా అందిస్తుంది, కానీ, బ్లూటూత్ కాలింగ్ లేదు. స్మార్ట్‌వాచ్ N Health యాప్ ద్వారా Android, iPhoneలతో పని చేస్తుంది.OnePlus Nord వాచ్ ధర రూ. 4,999గా ఉంటుంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
Gizmore Glow Luxe :
Gizmore అనేది ఢిల్లీ నుంచి రాబోయే టెక్ బ్రాండ్.. కంపెనీ ఇటీవలే గిజ్మోర్ గ్లోలక్స్‌ను లాంచ్ చేసింది. క్లాసిక్ రౌండ్-డయల్ డిజైన్‌ను ఇష్టపడే పురుషుల కోసం వాచ్ రూపొందించారు. యూజర్లు లెదర్, స్టీల్ బెల్ట్‌ల మధ్య ఎంచుకోవచ్చు. ఫీచర్ల పరంగా చూస్తే.. AMOLED స్క్రీన్, IP67-రేటెడ్ బిల్డ్‌తో కూడా వస్తుంది. సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్‌తో యూజర్లు సంతృప్తి చెందకపోవచ్చు. అయినప్పటికీ, Realme Watch 3 Proలో మీరు పొందే దాదాపు అన్ని ఫీచర్లను అందిస్తుంది. Gizmore Glow Luxe ధర రూ. 3,699గా ఉండనుంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
NoiseFit Evolve 2 :
గత ఏడాదిలోనే NoiseFit Evolve 2 లాంచ్ అయింది. మార్కెట్‌లో అత్యంత విలువైన డివైజ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. చాలా ఫ్రెండ్లీ UIని కలిగి ఉంది. యువకులు, వృద్ధుల కస్టమర్‌లకు బాగా ఉపయోగపడుతుంది. అదనంగా, వాచ్ మంచి కలర్లు, కాంతివంతమైన లైటింగ్ అందించే రౌండ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. AOD, బ్లూటూత్ కాలింగ్ వంటి కొన్ని అధునాతన ఫీచర్లతో వచ్చింది. తక్కువ ఫీచర్లు అంటే మరింత సరసమైన ధరతో వచ్చింది. గడియారం మంచి 5-రోజుల బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. NoiseFit Evolve 2 ధర రూ. 2,799గా ఉండనుంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
Dizo Watch R Talk :
మీరు Glow Luxe లాంటి వాచ్ కోసం చూస్తున్నారా? అయితే, Dizo Watch R సిఫార్సు చేసేందుకు బెస్ట్ ఆప్షన్. వాచ్ రెండు బటన్లతో రౌండ్ AMOLED డిస్ప్లేతో కూడా వస్తుంది. వాచ్ ఓల్డ్ స్కూల్ డిజైన్‌ను అందిస్తుంది. రెండింటికీ సరైనదిగా చెప్పవచ్చు. 10-రోజుల బ్యాటరీతో వచ్చింది. హార్ట్ రేట్ ట్రాకర్, SpO2, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీపావళి సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో కూడా అందుబాటులో ఉంది. డిజో వాచ్ R ధర రూ. 3,699గా ఉంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
Redmi Watch 2 Lite :
Redmi Watch 2 Lite స్మార్ట్ వాచ్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్. Realme Watch 3 Pro వాచ్ దగ్గరగా పోలి ఉంటుంది. GPS, నిరంతర SpO2 ట్రాకింగ్, 10-రోజుల బ్యాటరీ, ఎక్కువ లేదా తక్కువ అదే ఫీచర్లను అందిస్తుంది. రెడ్‌మి వాచ్ 2 లైట్ కొంచెం మెరుగైన నిర్మాణ క్వాలిటీని కలిగి ఉంది. ఢిల్లీ వంటి సర్కిల్‌లలో సేల్స్ తర్వాత సర్వీసు మెరుగ్గా ఉంటుంది. మీరు ఇప్పటికే Redmi Note స్మార్ట్‌ఫోన్‌ని వినియోగిస్తున్నారా? Watch 2 Lite మీ ఆప్షన్ అని చెప్పవచ్చు. Redmi Watch 2 Lite ధర రూ 4,999కు అందుబాటులో ఉంది.

Best smartwatches under Rs 5,000 you can buy this Diwali
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : 5 Best Smartwatches : భారత్‌లో రూ. 2వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. వెంటనే కొనేసుకోండి!