Fire-Boltt Infinity Smartwatch : ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Fire Boltt Infinity Smartwatch : ప్రముఖ వేరబుల్ కంపెనీ ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ 4GB స్టోరేజ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో 1.6-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది.

Fire-Boltt Infinity smartwatch launched in India_ Check price, specifications
Fire-Boltt Infinity Smartwatch : ప్రముఖ వేరబుల్ కంపెనీ ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ (Fire-Boltt Infinity) 4GB స్టోరేజ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో 1.6-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ 300 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది.
SPO2 ట్రాకింగ్, డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఫిమేల్ హెల్త్ మానిటరింగ్ వంటి వివిధ హెల్త్ ట్రాకర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ నోటిఫికేషన్‌లను కూడా అందిస్తుంది. మ్యూజిక్ కంట్రోల్ TWS కనెక్టివిటీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. వినియోగదారులు తమ ఇయర్‌ఫోన్‌లను స్మార్ట్‌వాచ్‌తో పెయిర్ చేసుకోవచ్చు.
భారత్‌లో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ రూ. 4,999 ధరతో వస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ-టైలర్ అమెజాన్ ఇండియా (Amazon India) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ బ్లాక్, గోల్డ్, సిల్వర్, గ్రే గోల్డ్ బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Fire-Boltt Infinity smartwatch launched in India
స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ 1.6-అంగుళాల HD LCD డిస్‌ప్లేను 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 400×400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌లో సిరి (SIRI) గూగుల్ అసిస్టెంట్ రెండింటిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ అందిస్తుంది. వేరబుల్ స్మార్ట్‌వాచ్ 4GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 300 పాటల స్టోరేజీ సామర్థ్యంతో పర్సనల్ MP3 ప్లేయర్‌ను అందిస్తుంది. వినియోగదారులు వాచ్ నుంచి మ్యూజిక్ వినవచ్చు. iPhone Android రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.
ఫీచర్ల పరంగా, ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ 300 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. SPO2 ట్రాకింగ్, డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఫిమేల్ హెల్త్ మానిటరింగ్ వంటి వివిధ హెల్త్ ట్రాకర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఆసక్తికరంగా, స్మార్ట్‌వాచ్ నోటిఫికేషన్‌లను కూడా అందిస్తుంది.
మ్యూజిక్ కంట్రోల్, TWS కనెక్టివిటీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. వినియోగదారులు తమ ఇయర్‌ఫోన్‌లను స్మార్ట్‌వాచ్‌తో పెయిర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫైర్-బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ కూడా IP67 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, స్పోర్ట్స్ 110 వాచ్ ఫేస్‌లతో వస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..